పశ్చిమగోదావరి

ఎంవి ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, మే 19: పాలకొల్లు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టరు శ్రీనివాస్ నాయక్ ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ గురువారం సోదాలు జరిపింది. 8 బృందాలుగా పాలకొల్లు, ఏలూరు, విజయవాడ, అమలాపురం, కాకినాడ, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించినట్లు ఎసిబి డిఎస్పీలు కెవివిఎన్‌వి ప్రసాద్, ఎస్‌వివిప్రసాదరావు, ఇన్‌స్పెక్టర్ లక్ష్మోజీ వెల్లడించారు. ఉదయం 9 గంటలకు బ్రాడీపేటలో నివసిస్తున్న ఎంవి ఇన్‌స్పెక్టర్ స్వర్ణశ్రీనివాస్ నాయక్ గృహానికి వెళ్లారు. ఆయన వద్ద ఉన్న రూ. 24 వేల నగదుతోపాటు వివిధ ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా పత్రాలను తనిఖీ చేశారు. అన్నిచోట్ల సోదాలు నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు ఇస్తామని, ఎసిబి అధికార్లు తెలిపారు.