పశ్చిమగోదావరి

తీరమంతా అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 19: రోను తుపాను గర్జించింది. జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూనే ఉన్నాయి. నరసాపురం రూరల్ మండలంలో తీరాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవానిలంక, చినమైనవానిలంక, మొగల్తూరు మండలంలోని పేరుపాలెం నార్త్, పేరుపాలెం సౌత్, కెపి పాలెం, భీమవరం మండలంలోని లోసరి, గూట్లపాడు, దొంగపిండి, నాగిడిపాలెం, కాళ్ళ మండలంలోని ఎస్సీ బోస్ కాలనీ, మాలవానితిప్ప తదితర మత్స్యకార గ్రామాలన్నీ రోను తుపానుతో వణికిపోతున్నాయి. గత 48 గంటలుగా ఈ తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కురవడంతో మత్స్యకారులు ఎవరూ బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. మరోపక్క 48 గంటలుగా జిల్లాలోని తీర ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బుధవారం రాత్రి గ్రామాలన్నీ అంధకారంలోనే ఉన్నాయి. గురువారం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ముందస్తుగానే అధికార యంత్రాంగం హెచ్చరించింది. దీంతో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆధ్వర్యంలో ఆదేశాలతో నరసాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ ఆ ప్రాంతంలోని మత్స్యకారులందరినీ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నరసాపురం రూరల్ మండలంలోని పెదమైనవానిలంకలో సముద్రం కోతకు గురవుతోంది. ఇప్పటికే గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఆ గ్రామంలోని రహదారి కోతకు గురైంది. జిల్లాలోని 19 కిలోమీటర్ల మేర ఉన్న తీరం వెంబడి నివసిస్తున్న గ్రామాల్లోని మత్స్యకారులు, ప్రజలు, పశువులను సమీపంలో ఉన్న తుపాను షెల్టర్లకు, పాఠశాలలకు తరలించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని ఇళ్ళన్నీ కూడా భారీ వర్షానికి నానిపోయాయి. నరసాపురం రూరల్, మొగల్తూరు రూరల్ వంటి ప్రాంతాల్లో ఒకటి రెండు తాటాకిళ్లు నానిపోయి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా 08814 - 276699 నెంబర్‌కు ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చునని సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ చెప్పారు. గ్రామాల్లోని విఆర్వోలు ఇప్పటికే బస చేసి ఉన్నారు.
అక్కడి ప్రజలకు అవసరమైన తాగునీటిని, ఆహారాన్ని అందిస్తున్నారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయితీరాజ్, మత్స్యశాఖ, జలవనరుల శాఖ, డ్రెయినేజి తదితర శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందిస్తున్నారు. రానున్న 48 గంటల్లో అధిక వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
పల్లపు ప్రాంతాలు జలమయం
చాగల్లు: మండలంలో బుధవారం రాత్రి నుండి గురువారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బురదతో నిండాయి. తుపాను తీరం దాటే సమయంలో అధిక వర్షం పడవచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం మెరికమ్మ సూచించారు. మండలంలో 48.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. కార్మికులు వర్షం వలన ఉపాధి కోల్పోయారన్నారు. వ్యాపార సంస్థలు వెలవెలబోయాయి. డ్రెయినేజీల పూడిక తీయించాలని ప్రజలు కోరుకొంటున్నారు. వర్షాలతోగ్రామాల్లో రోడ్లు గోతులు పడి అసౌకర్యంగా ఉన్నాయి.