పశ్చిమగోదావరి

బిజెపి లక్ష్యంగా విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 23: మినీ మహానాడు వేదిక భారతీయ జనతాపార్టీని టార్గెట్ చేసింది. వేదికపై ఉన్న నేతలు తమదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రసంగాలు చేశారు. ముందుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పలు విమర్శలు చేశారు. అనేక ఇబ్బందులు ఉన్నాయని, రాజధానికి కేంద్రం సహకరించాలన్నారు. భారతీయ జనతాపార్టీ టిడిపితో కలిసి రాష్ట్రంలో పయనిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాకు ఏమీ ఇవ్వక్కర్లేదని, రాజ్యసభలో మాట్లాడినట్టుగా రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వాలన్నారు. పక్క రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా సహకారం అందించాలన్నారు. ఇప్పటివరకు మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 సార్లు కలిశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నందున చేయూతనివ్వాలన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్‌రావు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు శకుని పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బిజెపి మిత్రపక్షంగా ఉంటుందని, విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలుచేయడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లికి - అమరావతికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్‌ల సంగతి మరిచిపోయారని విమర్శించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతాపార్టీ, ఎమ్మెల్సీ సోముపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.