పశ్చిమగోదావరి

అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జూన్ 16: వీరవాసరం మండలం కొణితివాడ పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను తహసీల్దార్ ఎంవి తిలక్ ఆదేశాల మేరకు గురువారం మూడు మట్టి ట్రాక్టర్లను సీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మండలస్థాయి నాయకులు ఒకరు ముందస్తు అనుమతి లేకుండా మట్టిని తరలిస్తుండగా ఆర్‌ఐ సుధీర్, విఆర్వో అలేఖ్యలు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్లు పరారీకావడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిట్రాక్టర్లు తిరుగుతున్నట్లు తహసీల్దార్ తిలక్ దృష్టికి రావడంతో చర్యలు తీసుకున్నారు. అయితే సుమారు 15 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయం పై తహసీల్దార్ వద్దకు వచ్చారు. జరిగిన సంఘటనపై మట్టిని తరలిస్తున్న వ్యక్తిది తప్పేనని తహసీల్దార్ తిలక్‌కు తెలిపారు. మట్టిని తరలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తహసీల్దార్‌కు క్షమాపణ చెప్పారు. అనంతరం తహసీల్దార్ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన సైనరైజేషన్ చెల్లించాలని ఆదేశించారు. అందుకు సంబంధిత వ్యక్తి అంగీకరించాడు. అనంతరం తహసీల్దార్ తిలక్ విలేఖర్లతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరిచేల మట్టిని ఎవరైనా తీసుకోవాలంటే ముందుకు అనుమతులు తీసుకోవాలని చెప్పారు.