పశ్చిమగోదావరి

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 16: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ రూపొందించిన నూతన వెబ్ సైట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ చదరంగం క్రీడాకారులకు, క్రీడాభిమానులకు సమగ్ర సమాచారం అందించేందుకు జిల్లా చదరంగం అసోసియేషన్ రూపొందించిన ఈ వెబ్‌సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగే చదరంగం క్రీడా సమాచారం, టోర్నమెంట్ వివరాలు, క్రీడాకారుల వివరాలు పొందుపరిచి ఉంటాయన్నారు. జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు తోట భోగయ్య, మాదాసు కిషోర్‌లు మాట్లాడారు. అనంతరం వెబ్‌సైట్ వివరాల బుక్‌లెట్‌లను విడుదల చేశారు. అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రాజేష్‌జైన్, కో-కన్వీనర్ అల్లు శ్రీనివాస్, వెబ్‌డిజైనర్ రవితేజ, ఫణీ, పెనె్మత్స శ్రీ్ధర్, మైలాబత్తుల ఐజక్‌బాబు పాల్గొన్నారు.