పశ్చిమగోదావరి

గెలుపోటములు సమానంగా స్వీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 16: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడే విజయాలు సొంతమవుతాయని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం ఎల్‌హెచ్ టౌన్ ఆధ్వర్యంలో గన్నాబత్తుల తులసమ్మ, పెదతాత ఇండోర్ స్టేడియంలో పశ్చిమగోదావరి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెలక్షన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటుచేసిన టఫ్ కోర్టును ఎంపి సీతారామలక్ష్మి ప్రారంభించగా, టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే ఈ సెలక్షన్స్‌కు సుమారు 250 మంది బాల,బాలికలు హాజరయ్యారు. టౌన్‌హాల్ అధ్యక్షులు మెంటే పార్థసారధి అధ్యక్షత జరిగిన సభలో ఎంపి సీతారామలక్ష్మి మాట్లాడుతూ క్రీడల పట్ల బాల్యం నుంచి ఆసక్తికనబర్చాలన్నారు. క్రీడారంగంలో తర్ఫీదు పొంది జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎల్‌హెచ్ టౌన్‌హాల్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించడానికి క్రీడాకార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు పేద విద్యార్థులకు ప్రోత్సహకాలు అందించడం అభినందనీయమన్నారు. జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టూరి సుబ్బారావు, వివి సోమరాజు, సుంకర సూర్యనారాయణ, ఎబి బేగ్, గిరి, గోపి, కిషోర్, టౌన్‌హాల్ ఉపాధ్యక్షులు గ్రంధి సురేష్, సంయుక్త కార్యదర్శి కామన నాగేశ్వరరావు, ఫిరోజ్‌బాబు, టౌన్‌హాల్ కార్యదర్శి ఎన్‌విఆర్ దాస్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి పాండురంగారావు, ఏసుబాబు, గనిరెడ్డి త్రినాథ్, కోళ్ల రామచంద్రరావు, ఎద్దు ఏసుపాదం పాల్గొన్నారు.