పశ్చిమగోదావరి

రోగులను ఇతర ప్రాంతాలకు తరలించ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 16 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడవలసిన బాధ్యత వైద్యులపై వుండగా హైరిస్క్ కేసులను గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఆసుపత్రులకు తరలించి వైద్యులు చేతులు దుపుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ వైద్యాధికారులను ప్రశ్నించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు వైద్య పరీక్షలు నిమిత్తం కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ రోగులను కాపాడవలసిన బాధ్యతను వైద్యులు విస్మరించి ఇతర ప్రాంత ఆసుపత్రులకు తరలించడం సరైన పద్దతి కాదని కలెక్టర్ అన్నారు. చంద్రన్న సంచార వైద్యశాలల వాహనాల్లో తప్పనిసరిగా వైద్యులుండేలా చర్యలు తీసుకోవాలని సంచార వైద్యశాలల్లో గ్రామాల్లో ఎంత మంది రోగులు వైద్యసేవలు పొందుతున్నదీ వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో స్కానింగ్, రక్తపరీక్షలు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ పేషెంట్‌ను బయటకు పంపడం ఎందుకని కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలో అన్న సంజీవని పధకం ద్వారా 37 షాపులు ఏర్పాటు చేయడం జరిగిందని రోగులకు అవసరమైన మందులు అతి తక్కువ ధరకే ఇక్కడ అమ్మడం జరుగుతున్నదని 37 షాపుల్లోనూ ఈ నెలలో 46 లక్షల రూపాయలు మాత్రమే అమ్మకాలు సాగడం చాలా తక్కువ మందులు అమ్మినట్లుగా తెలుస్తోందని అన్న సంజీవని పధకం ద్వారా ఇతర జిల్లాల్లో పేదలకు ఎక్కువ మందులు అమ్మకాలు సాగిస్తున్నారని మన జిల్లాలో కనీసం షాపునకు నెలకు లక్ష రూపాయలు కూడడా అమ్మకపోవడం పట్ల కలెక్టర్ ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు అన్న సంజీవని మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. 102, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ పధకం ద్వారా మరిన్ని సేవలను ప్రజలకు అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లాలో టిబి కేసులు పూర్తిగా నిరోధించేందుకు కృషి చేయాలని, గత ఆరు నెలలుగా 2387 టిబి కేసులు నమోదయ్యాయని ఇవి చాలా ఎక్కువ అని సాధ్యమైనంత వరకూ టిబి కేసులు తగ్గించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ విజయగౌరి, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ కె శంకరరావు, ఐసిడి ఎస్ ఎపిడి విజయకుమారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మోహన్‌కృష్ణ, టిబి కంట్రోలింగ్ అధికారి డాక్టర్ దుర్గారావు, పివో డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.