పశ్చిమగోదావరి

స్వీయ మదింపుతో ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 16: బదిలీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ అటు అధికారవర్గాల్లో కూడా మరింత ఉత్కంఠను రేపుతూ ముందుకు సాగుతోంది. ఇంతకుముందు ప్రకటించిన విధంగా చూస్తే గురువారం నాడు ఆప్షన్లు ఇచ్చినవారికి బదిలీల పోస్టులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే పనితీరును ఎవరికివారు స్వయంగా బేరీజు వేసుకునే విధంగా నిర్ణయాన్ని అమలుచేశారు. ఈవిధంగా బదిలీల జాబితాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతిఒక్కరి నుంచి గురువారం స్వయం మదింపు పత్రాలను స్వీకరించారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అయా శాఖల ఉన్నతాధికారులకు పంపారు. వీటిని వారు పరిశీలించిన అనంతరం ఉద్యోగులు వారి పనితీరుకు సంబంధించి ఇచ్చిన సమాచారాన్ని బేరీజు వేసి అధికారులు మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ సమాచారాన్ని ధృవీకరిస్తూ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని శుక్రవారం హార్డ్‌డిస్క్‌లో పొందుపర్చి ఎన్‌ఐసికి పంపిస్తారు. ఇక ఆతర్వాత బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంమీద బదిలీల వ్యవహారం కొంత చురుకుగానే ముందుకు కదులుతున్నట్లు కన్పిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్న మార్గదర్శకాల విషయంలో మాత్రం ఉద్యోగులు, అధికారుల్లో కొంత ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈవ్యవహారాలు ఇలా ఉంటే బదిలీల ప్రక్రియ నుంచి గృహనిర్మాణసంస్ధను మినహాయిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ఈ విభాగాన్ని ఇంకా విభజించని నేపధ్యంలో బదిలీలు సాంకేతికంగా హౌసింగ్‌లో సాధ్యం కాదని నిర్ధారించారు. ఈమేరకు బుధవారం రాత్రి బదిలీల ప్రక్రియ నుంచి ఈ విభాగాన్ని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు పంచాయితీరాజ్ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను జడ్పీ ఛైర్మన్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఆ విభాగం నిర్ణయం తీసుకుంది. కలెక్టరు ఆదేశించినా ఆ విభాగం నుంచి బదిలీ జాబితా కలెక్టరేట్‌కు చేరుకోలేదు. జివోలో పొందుపర్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ శాఖ పరిధిలో స్వయంగా బదిలీలు చేసుకోవడానికి రంగం సిద్దం చేశారు. ఇక ఉద్యోగ సంఘాల నేతల విషయం గురువారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫీస్ బేరర్లు అందర్ని బదిలీల జాబితా నుంచి తొలగించాలని నేతలు కోరుతున్న విషయం తెల్సిందే. అయితే జివోలో పొందుపర్చిన విధంగానే వారికి కూడా బదిలీలు తప్పవని కలెక్టరు స్పష్టం చేశారు. అయితే గురువారంనాటి పరిణామాల్లో 23మంది సంఘాల నేతలకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో మొత్తం కార్యవర్గంలో అధికశాతం మందికి ఈ మినహాయింపును వర్తింపచేసేవారు. అయితే ఈసారి నిబంధనల ప్రకారం అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారికి మాత్రమే ఈ మినహాయింపును పరిమితం చేశారు.