పశ్చిమగోదావరి

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 17 : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో వెంటనే స్పందించకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు హెచ్చరించారు. ఆచంట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం శుక్రవారం మార్టేరులోని రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ 10 రోజుల నుండి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని, అయినప్పటికీ రాష్ట్రంలోని కాపులందరూ ఎంతో శాంతియుతంగా, సహనంతో వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నీతి నియమాలకు మారుపేరుగా ఉన్న ముద్రగడ కుటుంబ సభ్యులతోపాటు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. అయితే అధికార టిడిపిలో ఉన్న కొంతమంది కాపు నేతలు చంద్రబాబునాయుడు మెప్పుకోసం పద్మనాభంపై బురదజల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాపుజాతిని అణగదొక్కాలన్న ఉద్దేశ్యంతో టిడిపి ప్రభుత్వం అసలైన దోషులెవరున్నారో వారిని పట్టుకోవడం మానివేసి కాపుసంఘాలలో ఎవరు తిరుగుతున్నారో వార్ని ఎక్కడదొరికితే అక్కడ అరెస్టుచేస్తున్న నేపథ్యంలో ముద్రగడ దీక్ష చేపట్టాల్సి వచ్చిందన్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనగా ఉందని, దీక్ష శిబిరం వద్ద పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని చినిమిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన వాగ్దానాలు అమలుజరపకపోతే కాపుజాతికి దూరమవుతామన్న వాస్తవాన్ని అధికార పార్టీ నేతలు గ్రహించాలన్నారు. బంద్‌లు జరగనీయకుండా కాపునాయకులను హౌస్ అరెస్ట్‌లు చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశ పాలనలో ఉన్నామో అర్ధంకావడం లేదన్నారు. ఇప్పటికైనా కాపుల కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా అధికార పార్టీలో ఉన్న కాపునాయకులు కృషిచేయాలని కోరారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. టిడిపి ప్రజాప్రతినిధులు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. కాపుయువసేన నాయకులు ఉండవల్లి రమేష్‌బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు కాపునాడుకు చెందిన పెద్దలే ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిస్తున్నారని, ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తే త్వరలో కాపువిద్యార్థి, యువజన సంఘాలు రోడ్లపైకి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాపునాడు నాయకులు వినుకొండ రంగారావు, జిల్లా నాయకులు గణేశుల నాగేశ్వరరావు, శ్రీను, యర్రా రాధాగోపాల్, కూనపురెడ్డి విఘ్నేశ్వరరావు, కంబాల బాబులు, పోలిపర్తి నాగశ్రీను, చల్లా శ్రీను, మైగాపుల రాంబాబు, మైగాపుల రాము పాల్గొన్నారు.