పశ్చిమగోదావరి

సిఎం పర్యటనకు చిట్టవరంలో ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జూన్ 17: ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఖరారుకావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లల్లో నిమగ్నమైంది. నరసాపురం మండలం చిట్టవరంలో ఏర్పాటుచేసిన ఏరువాక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరువాక కార్యక్రమానికి సిఎం చంద్రబాబు ఎద్దుల బండిపై వెళ్ళే విధంగా 25 ఎద్దుల బండ్లు సిద్ధంచేశారు. చిట్టవరం రోడ్డులోని సికిలే ఫౌండేషన్ స్ధలంలో 10వేల మంది కూర్చునే విధంగా బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వస్తే తడవని విధంగా వాటర్ ఫ్రూప్ పందిళ్లు (టెంట్లు), 10వేల కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. వేదిక సమీపంలో 20 ఎగ్జిబిషన్ స్టాల్స్, బహిరంగ సభకు సమీపంలో 10వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 20 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి అందరికి భోజనాలు అందేలా చర్యలు చేపడుతున్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ సిఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయితీరాజ్, పౌరసరఫరాలశాఖ, దేవాదాయధర్మాదాయశాఖ, సమాచార పౌర సంబంధాలశాఖ తదితర శాఖలతో పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను ఈనెల 19లోగా పూర్తిచేయాలని సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రాంతాన్ని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, డిఎస్పీ జి పూర్ణచంద్రరావు శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాధవనాయుడు అధికారులకు సూచనలు చేశారు.