పశ్చిమగోదావరి

20న ఏరువాకకు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీన ఉదయం నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటున్న దృష్ట్యా పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని మండలాధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ పంట ప్రారంభసూచికంగా చిట్టవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృష్ట్యా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో నరసాపురం చేరుకుంటారని అక్కడి నుండి 3.5 కిలోమీటర్లు దూరంలో వున్న చిట్టవరం గ్రామంలో ఎపిఇపిడిసిఎల్ ఏర్పాటుచేసిన సోలార్ లైట్ల కార్యక్రమంలో పాల్గొని వివిధ ఉపకరణాలను పంపిణీ చేస్తారన్నారు. అనంతరం రాష్ట్రంలో ప్రప్రధమంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఖరీఫ్ ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అక్కడికి ఎడ్లబండిలో చంద్రబాబు వస్తారనిచెప్పారు. మధ్యాహ్నం 11.15 గంటల నుండి ఒంటిగంట వరకు చిట్టవరం గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతి తీరుపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వ్యవసాయ ప్రగతి తీరును తెలుసుకుని రైతులతో పది నిమిషాలు ముచ్చటిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో రైతులనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. రైతులు, ప్రజలు ముఖ్యమంత్రి సభకు హాజరు కావడానికి ఆదివారం రాత్రికల్లా ఆయా గ్రామాలకు ఆర్‌టిసి బస్సులను అందుబాటులో ఉంచుతామని, 20వ తేదీ ఉదయం 6 గంటలకే రైతులను చిట్టవరం గ్రామానికి తీసుకురావడానికి ప్రతీ బస్సులో బాధ్యత గల ఒక అధికారిని ఉంచాలని చెప్పారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, డిఆర్‌డిఏ పిడి కె శ్రీనివాసులు, డ్వామా పిడి ఎం వెంకటరమణ పాల్గొన్నారు.