పశ్చిమగోదావరి

జల్సాల కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 17 : జల్సాలు, షికార్లకు అలవాటుపడిన యువత పక్కదారి పట్టింది. చివరకు బంధువుల ఇంటిలోనే దోపిడీ సీన్ చిత్రించి బంగారాన్ని దొంగతనం చేశారు. చివరకు పోలీసుల విచారణలో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న యువతీయువకులు కటకటాల పాలయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. స్థానిక పవర్‌పేటలో నివాసముంటున్న ఎన్ సరస్వతి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. పెదపాడు మండలం వసంతవాడలో నివాసముంటున్న తన పెద్దమ్మ అనంతలక్ష్మి ఇంటికి ఈ నెల 13న సరస్వతి వెళ్లింది. అక్కడ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం అంటూ ఆ ఇంటికి చేరుకుంది. ఆ రోజు సాయంత్రం వరకు బ్యాంకులో ఉండటంతో రాత్రి సమయంలో ఎందుకంటూ అనంతలక్ష్మి ఆమెను ఇంటిలోనే ఉండిపొమ్మని చెప్పింది. అయితే రాత్రి సమయంలో ఆ ఇంటిలో దోపిడీ జరిగింది. ఒక యువకుడు అనంతలక్ష్మిని బెదిరించి ఆమె వద్ద వున్న బంగారు ఆభరణాలను దోపిడీ చేశాడు. దీనిపై పెదపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే విచారణలో ఈ దోపిడీ సీనంతా సరస్వతి, మరో యువకుడి చిత్రీకరణే అని తేలింది. సరస్వతి చదువుతున్న కళాశాలలోనే తంగెళ్లమూడికి చెందిన జె పురుషోత్తం కూడా చదువుతున్నాడు. వీరిద్దరూ కలిసి తిరుగుతూ జల్సాలకు అలవాటుపడ్డారు. చేతిలో సొమ్ము ఆడకపోవడంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని చివరకు సరస్వతి పెద్దమ్మ ఇంటిలోనే దోపిడీకి ప్లాన్ వేశారు. ఆ విధంగా ముందుగా అనుకున్న ప్రకారం సరస్వతి ఆ ఇంటికి వెళ్లి రాత్రి సమయంలో పురుషోత్తంకు ఫోన్ చేసి రప్పించి అతను కత్తితో బెదిరిస్తున్నాడు, చంపేస్తానంటున్నాడంటూ నాటకీయ ఫక్కీలో కేకలు పెట్టి అతనికి అనంతలక్ష్మి వద్ద వున్న బంగారం మొత్తం ఇచ్చేలా చేసింది. ఈ క్రమంలో మొత్తం బంగారు ఆభరణాలు తీసుకున్న పురుషోత్తం అక్కడ నుంచి హడావిడిగా ఉడాయించాడు. చివరిలో సరస్వతి, అనంతలక్ష్మి ఒకరినొకరు ఓదార్చుకున్నారు. పోయిన సొమ్ము ఎలాగో పోయింది చేతికి వున్న నాలుగు గాజులు మిగిలియంటూ అనంతలక్ష్మి కొంత నిట్టూర్పు విడిచి సరస్వతిని కూడా ఓదార్చింది. అయితే 14వ తేదీ ఉదయం అనంతలక్ష్మి ఇంటిలోనుంచి బయటకు వెళ్లి సమయంలో సరస్వతి మళ్లీ ఫోన్ చేసి రాత్రి వెళ్లిపోయిన దొంగ మళ్లీ వచ్చి మిగిలిన నాలుగు బంగారు గాజులు కూడా దోచుకు వెళ్లాడంటూ చెప్పింది. ఈ పరిణామాలన్నింటిపై అనంతలక్ష్మి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు సరస్వతిపై అనుమానం వచ్చి ఆమెను మరింత ప్రశ్నించగా చివరకు అసలు వ్యవహారం వెలుగు చూసింది. రూరల్ సి ఐ ఎ నాగమురళీ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్ ఐ ఎన్ విజయ్‌కుమార్, ఏలూరు రూరల్ ఎస్ ఐ ఎన్‌వి సుభాష్‌లు ఈకేసును దర్యాప్తు చేశారు. ఈ కేసులో యువతీయువకులను అరెస్టు చేసి 17 కాసుల బంగారు ఆభరణాలను పోలసులు స్వాధీనం చేసుకున్నారు.