పశ్చిమగోదావరి

దుష్ప్రచారాలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 3 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుంచుకోవాలని, దుష్ప్రచారాలు మానుకోవాలని ప్రతిపక్ష వై ఎస్ పార్టీకి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి కష్టాలు, నష్టాల్లో ప్రభుత్వం వున్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు అనేక పధకాలను రూపొందిస్తూ సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అమలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు చంద్రన్న రంజాన్ తోఫాగా నిత్యావసర సరుకులను అందజేస్తున్నారని అన్నారు. గోదావరి, కృష్ణా జలాలను విలీనం చేయడం, రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయడం, గిట్టుబాటుధరలు వర్తింపచేయడం, ఇదంతా అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష వై ఎస్ ఆర్ పార్టీ తాము చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు. ఈ సందర్భంగా చింతమనేని దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వివరణ కోరారు. జలసిరి పధకం ద్వారా బోర్లు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ రైతులకు హితవు పలికారు.