పశ్చిమగోదావరి

భీమవరంలో గోవు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 3: కొద్ది రోజుల క్రితం పట్టణంలోని గోవులను స్థానిక బంట్రోతులవారి వీధిలో ఉన్న మున్సిపల్ స్థలానికి తీసుకువచ్చారు. ఇక్కడకు గోవులు ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది. అయితే వాటికి ఎటువంటి ఆహార, పానీయాలు పురపాలక సంఘ అధికారులు అందించలేదు. అయితే ఏం జరిగిందో తెలియదుగాని ఆదివారం రాత్రి ఒక గోవు మృతి చెందింది. ఈ గోవును పురపాలక సంఘం సిబ్బంది మున్పిపల్ చెత్త ట్రాక్టర్‌లో వేసి గునుపూడిలోని హిందూ స్మశాన వాటికకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మ రక్షా వేదిక, హిందూ చైతన్య వేదిక, గో రక్షణ, ఆర్‌ఎస్‌ఎస్, పలువురు కౌన్సిలర్లు వెళ్ళి అడ్డుకున్నారు. ఇది ముమ్మాటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని ధర్మ రక్షా వేదిక జిల్లా అధ్యక్షులు తోరం సూర్యనారాయణ అన్నారు. అధికారులు గోవు మృతికి సమాధానం చెప్పాలని కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణ అన్నారు. హిందూ చైతన్య వేదిక పట్టణ అధ్యక్షులు రావూరి అనంత్, గంటా హరి తదితరులు మున్సిపల్ ఉన్నతాధికారులకు గోవు మృతి పై ఫిర్యాదు చేశారు.