పశ్చిమగోదావరి

దేశాన్ని, ధర్మాన్ని కాపాడటమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 3: దేశాన్ని, ధర్మాన్ని కాపాడటమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యంగా పనిచేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత బౌద్ధప్రముఖ్ గుత్తా శేషారెడ్డి (ఆంధ్రప్రదేశ్) అన్నారు. సమాజ సేవలో ఐక్యమత్యంతో సంఘ్ ముందుకు వెళ్తోందన్నారు. ఆదివారం స్థానిక త్యాగరాజ భవనంలో ఆర్‌ఎస్‌ఎస్ గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు మంతెన రామచంద్రరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అతిథులుగా సూర్యమిత్ర ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ ఇర్రింకి సూర్యారావు, సిద్దార్ధ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డు దుర్గారావు హాజరయ్యారు. ముఖ్యవక్తగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత బౌద్ధప్రముఖ్ శేషారెడ్డి ప్రసంగించారు. దేశంలో ధర్మం ఎక్కడా లేకపోవడం వల్ల ఈ సమాజం రోగాల భారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాజాన్ని సంస్కరించుకోవడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాల్లో ఒకటన్నారు. ప్రజల్లో దేశక్తిని, ధర్మాన్ని ఆచరింపచెయ్యటం కోసం సంఘ్ పరివార్ అహర్నిశలో పని చేస్తోందన్నారు. ఈ ప్రాంతంలో నూరు గరుపూజోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు మంతెన రామచంద్రరాజు తెలిపారు. గురువు భగవంతునికి ప్రతిరూపమన్నారు. ఇటీవల కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరండని పిలుపునిస్తే 2 లక్షల మంది చేరడం జరిగిందని, వీరిలో 46 వేల మంది సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తే వారిలో 16వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు హాజరుకాగా వీరిలో 9 మంది ప్రచారక్‌లుగా తమ పూర్తి సమయాన్ని సమాజసేవకు అంటే ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇవ్వడం జరిగిందని రామచంద్రరాజు తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యవాహ్ కలిదిండి శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు.