పశ్చిమగోదావరి

బెల్టుషాపులను నిరోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 3 : జిల్లాలో బెల్టుషాపులను పూర్తిగా నిరోధించాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక శనివారపుపేట రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ పనితీరుపై ఆమె సమీక్షించారు. జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఎక్కువగా బెల్టుషాపులున్నట్లు తన దృష్టికి వచ్చిందని మెట్ట ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బెల్టుషాపులు ఉన్నాయని దానివలన పలువురు మహిళలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లాలో ఎక్కడా కూడా మహిళలకు ఇబ్బంది కలిగించే బెల్టుషాపులు ఉండడానికి వీల్లేదని ఎక్కడైనా బెల్టుషాపులు గుర్తిస్తే భారీ పెనాల్టీ విధించి భవిష్యత్తులో అక్కడ బెల్టుషాపు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 2014-15లో జిల్లాలో 38 బెల్టుషాపులపై కేసులు నమోదు చేస్తే, 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 59 బెల్టుషాపులపై కేసులు నమోదయ్యాయని జిల్లాలో ఎక్కడ బెల్టుషాపు కనిపిస్తే అక్కడ లక్ష రూపాయల వరకూ జరిమానా విధించాలని జిల్లాలో ఎక్కడా కూడా బయట మద్యం విక్రయించడాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాలని చెప్పారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎక్కడా కూడా మద్యం షాపులు కనిపించడానికి వీల్లేదని జిల్లాలో 458 మద్యం షాపుల్లో 104 జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్నాయని వాటి వలన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇటువంటి షాపులను తక్షణమే జాతీయ రహదారికి 50 మీటర్ల లోపలకు మద్యం షాపులను తరలించాలని అధికారులను ఆదేశించారు. నాటుసారాయి తయారీకి పాల్పడుతున్న 182 గ్రామాలను ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది దత్తత తీసుకుని ఆయా గ్రామాల్లోని 369 అంగన్‌వాడీ కేంద్రాలలో 6310 భోజనం ప్లేట్‌లు, గ్లాసులు అందించడం అభినందనీయమని సుజాత చెప్పారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వైబి భాస్కరరావు మాట్లాడుతూ జిల్లాలో 322 మంది ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఉన్నారని, వారి టి ఏ బిల్లులో కొంత సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే 16 వేల నోటు పుస్తకాలు, పెన్నులు, ఏడు వేల పలకలను అయిదవ తరగతి లోపు విద్యార్ధినీ విద్యార్ధులకు అందించే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 50 సంవత్సరాలు పైబడిన 1666 మంది కల్లుగీత కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పెన్షన్లు అందిస్తున్నామని కల్లుగీత కార్మికుడు చెట్టుపై నుండి పడి మరణిస్తే రెండు లక్షల రూపాయలు బీమా పరిహారం ఇస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై శ్రీనివాసచౌదరి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సురేష్‌బాబు, నాగేశ్వరరావు, 16 మంది సి ఐలు పాల్గొన్నారు.