పశ్చిమగోదావరి

ఇంక అల్లంత దూరమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 3 : ఇంకొంతకాలమే... మనం అధికారంలోకి వస్తాం... ఆ తరువాత ఇన్నాళ్లూ కష్టపడిన వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుంది... అంటూ రెండేళ్ల క్రితం ఎన్నికల ముందు టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు జిల్లా జిల్లా పార్టీ కేడర్‌కు హామీలు ఇస్తూ ముందుకు సాగిపోయారు. ఆయన చెప్పిన విధంగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా పూర్తి మెజార్టీతో కొలువుతీరింది. ఆ తరువాత పూర్తిస్థాయిలో న్యాయం జరిగిపోతుందని కేడర్ అంతా ఎదురు చూపులు చూస్తేనే వున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడచిపోయినా నామినేటెడ్ పదవుల పందారం పూర్తిస్థాయిలో ముందుకు సాగకుండా నిలచిపోయింది. ఈ పరిస్థితిపై ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో తీవ్ర నిరాశ నెలకొని వుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో ఈ పదవుల పందారం జరిగింది దాదాపు అరకొరగానే అని చెప్పుకోవచ్చు. పలు చోట్ల మార్కెట్ కమిటీలను భర్తీ చేసినా అధిక శాతం పోస్టులు ఇంకా ఖాళీగానే కొనసాగుతున్నాయి. వాటిని ఆశించిన ద్వితీయ శ్రేణి నాయకత్వం నేతల చుట్టూ ఇంకా ప్రదక్షిణాలు చేస్తూనే వున్నాయి. అయితే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో వారి ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. దీనికి తోడు పొత్తు కుదుర్చుకున్న బిజెపి కేడర్‌కు కూడా ఈ పదవుల్లో కొంత భాగం కేటాయించే పరిస్థితి ఉండటంతో ఏది దక్కుతుందో ఏది మిత్రత్వంలో జారిపోతుందో అర్ధం కాక కేడర్ అంతా అయోమయంగా కొనసాగుతున్నారు. జిల్లా పరిస్థితి చూసినా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. అధిక శాతం ప్రాంతాల్లో మార్కెట్ కమిటీల నియామకాలు జరిగినా మిగిలిన పోస్టుల భర్తీ ముందుకు సాగలేదు. కనీసం ఆలయ కమిటీల్లో వుండే పోస్టులైనా దక్కించుకుందామని ఎంతో మంది వేచిచూస్తున్నా వాటికి సంవత్సరాలు గడుస్తున్నా మోక్షం లేకుండా పోతోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో కీలకంగా ఉండే ఆర్ ఆర్ పేట వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఏర్పాటు విషయంలోనూ ఇదే పరిస్థితి సాగుతోంది. దీనికి ప్రతిపాదనలు పంపించినా వాటికి మోక్షం లభించలేదు. ఆ విధంగా పలు నియోజకవర్గాల్లో ఎన్నో కీలకమైన ఆలయ కమిటీలు ఖాళీగానే కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఇతరత్రా కార్పొరేషన్లు వాటిలో డైరెక్టర్ పోస్టులు వంటివి అనేకం వున్నా వాటి భర్తీ విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే వాస్తవంగా చూస్తే అధికారంలోకి రావడం ఘన విజయంతోనే సాగిపోయినా ఆ తరువాత తొలి నాళ్లలోనే ఈ పదవులు దక్కించుకోగలిగితే కొన్నాళ్లపాటు ఆ అధికార హోదా అనుభవించవచ్చునని, కాలం గడచిపోయిన కొద్దీ రానున్న ఎన్నికలకు మరోసారి సిద్ధంకావాల్సిన వాతావరణం వచ్చేస్తే అప్పుడు ఏ పరిస్థితులు వుంటాయో అప్పటికి తాము నమ్ముకున్న నేతల హవా నడుస్తుందో లేదోనన్న ఆందోళన ద్వితీయ శ్రేణి నాయకత్వంలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు అధికార యోగం ప్రశాంతంగా సాగినా ఆ తరువాత మాత్రం రానున్న ఎన్నికలు పూర్తిగా రాజకీయ వాతావరణాన్ని హైజాక్ చేస్తాయనడం సర్వసాధారణం. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగా మరొక మూడేళ్లు మాత్రమే మిగిలివుంది. ప్రస్తుతానికి ఈ పదవులు దక్కించుకోకుంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలుంటాయో అర్ధంకాని పరిస్థితి నెలకొని వుంది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో వున్నా పార్టీని నమ్ముకుని కొనసాగి వచ్చిన ఆదాయంలో చాలా భాగం పార్టీకే ధారపోసి నమ్ముకుని వుంటే ఇప్పడు తమకిస్తున్న విలువ, గౌరవం ఏమిటన్న ఆవేదన కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో వ్యక్తమవుతోంది. జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే దాదాపు అన్ని చోట్లా ద్వితీయ శ్రేణి గుర్తింపు కోసం పదవుల పందేరం ఎప్పుడు జరుగుతుందా అన్న అంచనాలోనే కొనసాగుతున్నారు. ఎప్పటికప్పుడు రానున్న వారంలో ప్రకటనలు వెలువడతాయని చెప్పడం తప్ప ఆ వెనువెంటనే మరో సమస్య రావడం లేదా మరో రాజకీయ ఇబ్బంది ఎదురవడంతో ఈ వ్యవహారం పక్కకు వెళిపోతూ వస్తోంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ మమ్మల్ని బుజ్జగించేందుకు పదవుల పందేరం చేపట్టినా దాని వల్ల పార్టీకి తప్ప తమకేమీ ఒరగదని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.