పశ్చిమగోదావరి

కాల్‌మనీ బాధితులకు ఉపశమనం కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 4: జిల్లాలో 5,10 రూపాయల వడ్డీలతో ప్రజలను దోపిడి చేసే కాల్‌మనీ వ్యాపారులను అరెస్టు చేసి బాధితులకు ఉపశమనం కల్పించాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను ఆయన స్వీకరించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన కొక్కిరపాటి ఎస్తేరమ్మ, సిరిమామిళ్ల తాయారమ్మ, గుంటాన గంగమ్మలు వినతిపత్రం సమర్పిస్తూ తాము తమ గ్రామంలో ఒకరి వద్ద అప్పు తీసుకున్నామని, తీసుకున్న మొత్తాన్ని చెల్లించినప్పటికీ ప్రాంసరీ నోట్లు ఇవ్వకుండా ఇంకా అప్పు తీర్చాలంటూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ కాల్‌మనీ వడ్డీవ్యాపారుల ఆగడాల వల్ల ఎంతోమంది పేదల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, వడ్డీవ్యాపారులపై ఉక్కుపాదం మోపి కఠినంగా అణచివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఐ భాస్కరరావు, కొండరాయ కృష్ణ తదితరులు వినతిపత్రం సమర్పిస్తూ రాజమండ్రి ఎంపి దత్తత తీసుకున్న సంజీవపురం గ్రామంలో వివిధ పధకాలకు మంజూరైన నిధులను జన్మభూమి కమిటీ సభ్యులు అన్యాక్రాంతం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిపిఓను కలెక్టరు ఆదేశించారు. దేవరపల్లి గ్రామంలో తమకు హాస్టల్‌లో సీట్లు ఇవ్వటం లేదని విద్యార్ధులు జి అనిల్‌కుమార్, పి వెంకటరమణ, ఎం రామలక్ష్మి, మంగతాయారు ఫిర్యాదు చేయగా జిల్లాలో హాస్టళ్లలో చదువుకోవాలనుకునే అర్హతగల విద్యార్ధులందరికి ప్రవేశం కల్పించాలని ఎస్సీ,ఎస్టీ,బిసి వెల్ఫేర్ అధికారులను కలెక్టరు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డిఆర్వో కె ప్రభాకరరావు, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిఎస్‌ఓ శివశంకర్‌రెడ్డి, డిపిఓ సుధాకర్, డ్వామా పిడి వెంకటరమణ పాల్గొన్నారు.