పశ్చిమగోదావరి

న్యాయం జరగకపోతే ఖాళీ చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, జూలై 4: పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారే తమకు సమన్యాయం జరుగకుంటే నివాసిత ప్రాంతాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదని నిర్వాసిత రైతాంగం సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే ప్రాజెక్టు కింద నిర్వాసితులుగా మారే తమను గత పాలకులు కేవలం వారి స్వలాభాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా భూసేకరణ నిర్వహించి ఎకరాకు కేవలం 1.15 లక్షలు అందిస్తూ అందులోనే బ్యాంకు రుణాలను సైతం జమ చేసుకున్నారన్నారు. ప్రస్తుతం అదే ప్రాజెక్టుకు జాతీయహోదా రావడం, నూతన భూసేకరణ చట్టం అమలు కావడంతో ఎకరాకు 10.85 లక్షలు ఇస్తున్నారన్నారు. అయితే తమకు ఎంతోకొంత న్యాయం చేయకుంటే ఈ ప్రాంతం నుండి ఖాళీ చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడ సిద్ధమని వారు స్పష్టం చేశారు. ఈ సందర్నంగా తహసీల్దారు శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది నిర్వాసితులు పాల్గొన్నారు.