పశ్చిమగోదావరి

చినవెంకన్నకు రూ.1.91 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూలై 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడచిన 28 రోజులకు గాను 1.91 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సోమవారం ఆలయ హుండీల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపేణా 1,91,03,478 రూపాయల నగదు లభించినట్లు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా శ్రీవారికి 404 గ్రాముల బంగారం, 7.302 కిలోల వెండి లభించినట్టు ఇఒ వివరించారు. ఈ లెక్కింపులో విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.