పశ్చిమగోదావరి

కాపులను బిసిల్లో చేరిస్తే ప్రజాపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-బిసి హక్కుల పరిరక్షణ సమితి హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూలై 5: కాపుల్ని బిసిల్లో చేర్చితే ప్రజాపోరాటం చేస్తామని బిసి హక్కుల పరిరక్షణ సమితి ప్రకటించింది. మంగళవారం పట్టణంలో భీమవరం నియోజకవర్గ బిసి సంఘాల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బిసి నాయకులు పాకా సత్యనారాయణ, వేండ్ర వెంకట స్వామి, మామిడిశెట్టి ప్రసాద్ మాట్లాడారు. కాపుల్ని బిసిల్లో చేర్చేందుకు అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని రాష్ట్ర బిసి కమిషన్ ముసాయిదాను ప్రకటించిందన్నారు. అభ్యంతరాలు తెలియచెప్పేందుకు ఈనెల 7న చలో విజయవాడకు పిలుపునిచ్చామని తెలిపారు. విజయవాడలోని బిసి కార్పొరేషన్ కార్యాలయం వద్ద తమ అభ్యంతరాలు తెలియచేస్తామన్నారు. ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, మేకా శేషుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభకు పట్టంకట్టాలని ఉద్యమించిన కాపునాయకులు ఇప్పుడు బిసిల్లో చేర్చాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాపులను బిసిల్లో చేర్చితే కొన్ని కులాలు కనుమరుగైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బిసిల రిజర్వేషన్ 25 శాతం నుంచి 50శాతంకు పెంచాలని 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు.