పశ్చిమగోదావరి

కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 18: మోడి-చంద్రబాబుల జోడి ధరలు తగ్గిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అందుకోసం నల్లధనం తెచ్చి ఖర్చుచేస్తామన్న వాగ్ధానాలు గాలికొదిలేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం విమర్శించారు. స్ధానిక కలెక్టరేట్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ అధికధరలు, నిరుద్యోగం పెంచే విధానాలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్నాయన్నారు. వందరోజుల్లో ధరలు తగ్గించే వాగ్ధానం బదులుగా గత రెండుసంవత్సరాల్లో పప్పులు, నూనెలు, సబ్బులు, పేస్టులు, మందులు, రైలు,బస్సు, డీజీలు, పెట్రోలు తదితర ధరలు పెంచారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని, డ్వాక్రా,రైతు రుణాల రద్దుచేస్తామన్న హామీని తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. కొత్త జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారన్నారు. అధికధరలు, నిరుద్యోగం తగ్గించే పని ప్రభుత్వాలు వెంటనే చేపట్టాలని లేకపోతే మరింత పెద్దఎత్తున ప్రజాఉద్యమం చేపడతామని బలరాం హెచ్చరించారు. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం, నగర నాయకులు బి సోమయ్య, గుడిపాటి నరసింహరావు, పి కిషోర్, బి జగన్నాధరావు, వి సాయిబాబు, సిహెచ్ రాజ్యలక్ష్మి, కె విజయలక్ష్మి, పికె విజయలక్ష్మి, పివి రామకృష్ణ, కె దుర్గారావు, ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తూరు చెరువుకు పోలవరం కుడికాలువ నీరు తరలింపు

పోలవరం, జూలై 18: పోలవరం రెవెన్యూ పరిధిలోని కొత్తూరు చెరువుకు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి మోటార్ల ద్వారా గోదావరి నీటి తరలింపు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కొత్తూరు చెరువుకు పట్టిసం ఎత్తిపోతల నుండి కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు వెళుతున్న నీటిని చెరువులోకి తరలించాలని గతంలో పట్టిసం వచ్చిన ముఖ్యమంత్రికి రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఎత్తిపోతలు నిర్మించి నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సీజన్‌కు ఎత్తిపోతల్లోని మోటార్లను ఆన్‌చేయడానికి వచ్చిన సిఎం దృష్టికి మరోసారి రైతులు తీసుకువెళ్లడంతో అక్కడే ఉన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కుడి కాలువ నుంచి చెరువుకు నీటిని తరలించాలని ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాలు అందుకున్న ఇంజనీరింగ్ అధికారులు కుడి కాలువ 3.5 కిలోమీటర్ల వద్ద ఆరు మోటార్లను ఏర్పాటుచేసి చెరువులోకి నీటిని తరలించడం ప్రారంభించారు. 15 మోటార్ల ద్వారా నీటిని తరలిస్తామని కుడి కాలువ ఇఇ దేవప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఆరు మోటార్లతో నీటిని తరలిస్తున్నామని, ఒకటీ రెండ్రోజుల్లో 15 మోటార్లతో నీటిని తరలిస్తామన్నారు. పది మోటార్లు 15 హార్స్‌పవర్‌వి కాగా, అయిదు 10 హార్స్‌పవర్‌వి ఏర్పాటుచేస్తున్నామని ఇఇ తెలిపారు. ఇదిలా ఉండగా కొత్తూరు చెరువులో తూములు పాడవడంతో గత మే నెలలో రూ.43లక్షల నిధులతో వీటిని బాగుచేసే కార్యక్రమం ప్రారంభమైంది. మూల తూముకు ఏర్పాటుచేసిన షట్టర్ పనిచేయకపోవడంతో నీరు వృధాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎఇ కార్తీక్ మాట్లాడుతూ రెండు రోజుల్లో తూము సమస్యను పరిష్కరించి, చెరువునీటిని వృధాగా పోకుండా చూస్తామని తెలిపారు.