పశ్చిమగోదావరి

ఏలూరు ట్రాఫిక్ డిఎస్పీగా శ్రీనివాసరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 21 : జిల్లా కేంద్రమైన ఏలూరు ట్రాఫిక్ డి ఎస్‌పిగా ఎ శ్రీనివాసరావు గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుంటూరు అర్బన్ ఎస్‌సి, ఎస్‌టి సెల్ డి ఎస్‌పిగా పనిచేస్తూ బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు డి ఎస్‌పిగా పనిచేసిన పి సుధాకరరావును ఎసిబి డి ఎస్‌పిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాఫిక్‌ను సజావుగా జరిగేందుకు గాను పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందించి వ్యవహరిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అందుకు ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. 91వ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు స్టేషన్లలో, విశాఖ జిల్లాలోనూ పనిచేసి సి ఐగా పదోన్నతి పొంది విశాఖ సిటీలో సి ఐగా పనిచేస్తూ పదోన్నతిపై రూరల్ డి ఎస్‌పిగా వెళ్లానని, అనంతరం శ్రీకాకుళం డి ఎస్‌పిగా పనిచేసి గుంటూరు ఎస్‌సి, ఎస్‌టి సెల్ డి ఎస్‌పిగా పనిచేస్తూ ఇప్పుడు ఏలూరు ట్రాఫిక్ డి ఎస్‌పిగా వచ్చానని తెలిపారు. డి ఎస్‌పి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్ ఐలు ఎ పైడిబాబు, జి లక్ష్మణరావు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పూల బొకేలను అందజేసి స్వాగతం పలికారు. సుధాకరరావును నుంచి శ్రీనివాసరావు ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా డి ఐజి, ఎస్‌పిలను కలుసుకున్నారు.