పశ్చిమగోదావరి

వృథా జాలల తరలింపుతో కృష్ణాజిల్లాను ఆదుకున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 21: సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణా జిల్లాకు తరలించి అక్కడి రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని మాకినేని వెంకటరమణ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ మాకినేని పరమేశ్వరరావు అన్నారు. అనుమోలు ఛారిటబుల్ ట్రస్టు, మాకినేని వెంకటరమణ ఛారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రైతులను ఎత్తిపోతల చూపించేందుకు గురువారం ఉదయం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పరమేశ్వరరావు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ బందరులో గోదావరి నీటిని చూడటం వల్ల ఇక్కడకు వచ్చి పట్టిసీమ ఎత్తిపోతల చూడాలనే కోరిక తమకు కలిగిందన్నారు. దాంతో పెనమలూరు ప్రాంతం నుండి రైతులను తీసుకొచ్చామన్నారు. గత సంవత్సరం కృష్ణా నదికి నీరులేక పంటలు పండలేదని, రూ.1450 కోట్లతో ఒక సంవత్సరంలో ఎత్తిపోతల నిర్మాణం చేయడం అద్భుతమన్నారు. పట్టిసం వల్ల కృష్ణా జిల్లాలో ఉన్న చివరి ఎకరాకు కూడా నీరందుతుందని, అలాగే తాగునీటి అవసరాలు కూడా తీరతాయని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని కొనియాడారు. పట్టిసం నిర్మించినందుకు కృష్ణా జిల్లా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా పట్టిసం ఎత్తిపోతల పథకంలోని మోటార్లను పరిశీలించి, గోదావరి నదిని తిలకించారు. అనంతరం డెలివరీ పాయింట్ వద్దకు చేరుకుని కుడి కాలువలోకి వెళ్తున్న గోదావరి నీటిని చూసి హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎత్తిపోతల డిఇ శ్రీకాంత్ పథకం వివరాలు తెలియజేశారు. అనంతరం రైతులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి తరలివెళ్లారు. ఇలావుండగా పట్టిసం ఎత్తిపోతల పథకంలోని 10 మోటార్ల ద్వారా కుడి కాలువలోకి రోజుకు 3 వేల 540 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు.