పశ్చిమగోదావరి

ఉద్యోగం చేసేచోటే నివాసం ఉండాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 21 : ఉద్యోగం చేసే ప్రాంతంలోనే ఎంఇవోలు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంతా ఖచ్చితంగా స్థానికంగా నివాసం ఉండాలని అలా స్థానికంగా లేకుండా వేరే ప్రాంతాల నుండి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం విద్యాశాఖాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండక వేరే ప్రాంతం నుండి రావడం వలన సకాలంలో విధులకు హాజరుకాలేకపోతున్నారని అంతేకాకుండా సాయంత్రం వెళ్లే హడావిడిలో ముందుగానే పాఠశాల విడిచి వెళ్లడం వలన విద్యాప్రమాణాలు ఆశించిన విధంగా జరగడం లేదన్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉంటే పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల చదువులు వారి ప్రవర్తన తదితర అంశాలపై ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడుచర్చించి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేలా అవసరమైన సలహాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు వారు పనిచేసే ప్రాంతంలోనే ఖచ్చితంగా నివాసముండాలని ఉపాధ్యాయుల ప్రతీ కదలిక వారు ఎక్కడ నుండి వచ్చేది తమకు స్పష్టంగా తెలుస్తుందని నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఎం ఇవోలు వారి పరిధిలో ఉన్న పాఠశాలలను ప్రతీ రోజూ ఒక పాఠశాలను సందర్శించి నెలలో కనీసం 25 సందర్శనలు చేయాల్సి ఉండగా చాలా మంది సందర్శించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎం ఇవోలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉంగుటూరు ఎంఇవో 9 సందర్శనలు, పోడూరు ఎం ఇవో 8 సందర్శనలు, పెదపాడు ఎం ఇవో 6, కుకునూరు 5, పెనుగొండ 10, దెందులూరు 7 సందర్శనలు మాత్రమే చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం, వేలేరుపాడు ఎం ఇవోలు సమావేశానికి రాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చాచర్జెస్ ఫ్రేమ్ చేయవలసిందిగా డి ఇవో డి మధుసూధనరావును ఆదేశించారు. సమావేశానికి రాకపోయినా నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయకపోయినా సంబంధితాధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. టైమ్‌కు జీతాలు కావాలి, ఇంక్రిమెంట్లు కావాలంటూ హక్కులు అడుగుతారు గానీ బాధ్యతలు గాలికి వదిలేసి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. విద్యాశాఖపై జిల్లా విద్యాశాఖాధికారికి సరైన నియంత్రణ లేకపోవడం వలనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డి ఇవో మధుసూధనరావుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎం ఇవోలు పాఠశాలల తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే మీరేం చేస్తున్నారని డి ఇవోను ప్రశ్నించారు. జిల్లాలోని పాఠశాలల సక్రమ నిర్వహణకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డి ఇవోను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, కిచెన్ గార్డెన్లు, మంచినీటి సరఫరా, విద్యుత్తు వంటి వౌలిక సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రతీ తరగతి గదికీ ఒక ఫ్యాను, ఒక లైటు ఉండేలా చూడాలన్నారు. తాను తనిఖీకి వచ్చే సమయానికి ఆయా స్కూళ్లలో వౌలిక సౌకర్యాలు ఉండాలని, ఏ స్కూలులోనైనా ఏ ఒక్కటి లేకపోయినా సంబంధితాధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రతీ పాఠశాలలోనూ స్కూలు అనంతరం సాయంత్రం ఒక గంట విద్యార్ధులతో తప్పనిసరిగా ఆటలాడించాలని చెప్పారు. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు అందించి విద్యార్ధులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా చూడాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలనే ఆలోచనచ వారిలో వచ్చేలా పాఠశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సమావేశంలో డి ఇవో డి మధుసూధనరావు, సర్వశిక్ష అభియాన్ పిడి డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.