పశ్చిమగోదావరి

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే సంక్షేమాధికారులపై చర్యలుకలెక్టర్ భాస్కర్ హెచ్చరిక్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 21 : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్ధినీ విద్యార్ధులెవరైనా అనారోగ్యం బారిన పడినా, లేదా ప్రమాదం జరిగినా సంబంధిత హాస్టల్ సంక్షేమాధికారిని బాధ్యులను చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేయిస్తానని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సంక్షేమవసతిగృహాల పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతిగృహాలలోని విద్యార్ధినీ విద్యార్ధుల సంక్షేమానికి సంబంధించి పూర్తి బాధ్యత సంబంధిత హాస్టల్ సంక్షేమాధికారిదేనని, వారికి పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వసతిగృహాలలో పౌష్టికాహారం కొరత, పారిశుద్ద్యం లోపం కారణంగా విద్యార్ధినీ విద్యార్ధులు తరచూ జ్వరాలు, డయేరియా వంటి వ్యాధులతో బాధపడుతుంటారని, హాస్టల్‌లోని పిల్లలు తరచూ బయట తిరగడంతో కొన్ని ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా హాస్టల్ సంక్షేమాధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవలన్నారు. సంబంధిత శాఖల అధికారులు వారంలో మూడు రోజులు వసతిగృహాలను ఆకస్మిక తనిఖీలు చేసి హాస్టల్స్‌లో మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని, భోజన, వసతి సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్య తదితర అంశాలను పరిశీలించి నివేదికలు పంపాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ సంక్షేమ వసతిగృహం ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, దోమల నిర్మూలనకు ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల నిర్మూలన మందులు చల్లించాలన్నారు. వసతిగృహాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి విద్యార్ధినీ విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, విద్యార్ధులెవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాదపడుతూ ఉంటే వెంటనే మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సంబంధించి హాస్టల్, పాఠశాల వేరువేరుగా దూరంగా ఉంటున్న కారణంగా విద్యార్ధినీ విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాలల నుండి హాస్టల్‌కు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, కావున హాస్టల్, పాఠశాలలు వేరువేరుగా లేకుండా ఒకే ఆవరణలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించి సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వసతిగృహాలలో పాఠశాలల నిర్వహణకు అవసరమైన తరగతి గదుల నిర్మాణానికి సర్వశిక్ష అభియాన్ నుండి అదనపు తరగతి గదులు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 25 లోపు బాలబాలికలు ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై విచారణ చేయాలని, ఇందుకు ఇతర శాఖలకు సంబందించిన అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఆయా వసతిగృహాలలో బాలబాలికల సంఖ్య తగ్గడంపై గల కారణాలు, గత అయిదు సంవత్సరాలుగా ఆయా వసతిగృహాలలో విద్యార్ధినీ విద్యార్ధుల వివరాలు, విద్యార్ధినీ విద్యార్ధులు చేరేందుకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని జెసి-2 షరీఫ్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలలో 4వ తరగతి చదువుతున్న 93 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు వచ్చే విద్యా సంవత్సరం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులను ఆదేశించారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రంగలక్ష్మీదేవి, మైనార్టీస్ సంక్షేమాధికారి హెచ్‌పి ఎస్ మూర్తి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి తదితరులు పాల్గొన్నారు.