పశ్చిమగోదావరి

హోదాకోసం సమిష్టిగా సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 21 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని, అప్పుడే ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎండి రఫీయుల్లాభేగ్ అన్నారు. గురువారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం వున్నట్లు తమ పార్టీ అధిష్టానం తెలియజేసిందని, దీనిలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరుతూ తాము ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వైసిపి రాష్ట్రానికి మంచి జరిగితే తమ పార్టీ తప్పక మద్దతిస్తుందంటూ స్పష్టం చేశారని అన్నారు. టిడిపి తమ వైఖరిని స్పష్టం చేయాల్సి వుందన్నారు. ప్రత్యేక హోదాపై పెట్టిన బిల్లు రాజ్యసభలో చర్చకు రానున్న సందర్భంగాపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలుంటాయన్నారు. కేంద్రం అందించే నిధుల్లో తిరిగి రాష్ట్రం 90 శాతం నిధులు కట్టనవసరం లేదని, అలా కాకుండా టిడిపి ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే 75 శాతం నిధులు తిరిగి కట్టాల్సి వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ద్వారకాతిరుమల, పాలకొల్లు ప్రాంతాల్లో పలువురు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీ సంస్థాగత పదవులకు సైతం పెద్ద ఎత్తున పోటీ నెలకొందన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి ప్రదీప్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామంటూ హామీ ఇచ్చి రెండేళ్లు అయినాగానీ ఇప్పటి వరకు మాట్లాడకపోవడం విడ్డూరంగా వుందన్నారు. కనీసం రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఎవి ఎస్ పద్మరాజు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా పోరాడతారని, మన రాష్ట్రంలో కూడా అటువంటి వాతావరణం రావాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంతి వెంకయ్యనాయుడు గతంలో ప్రత్యేక హోదాపై ఉపన్యాసాలు ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదంటూ విమర్శించారు. ఆయన వెంట మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాకలపాటి సుభద్రాదేవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సతీష్, అప్పారావు, జోగిరాజు, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు జెండాలు చేతపట్టి పాదయాత్రగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి గాంధీ మైదానం వద్దకు వెళ్లి అక్కడ వున్న జాతిపితకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు.