పశ్చిమగోదావరి

చినకాపవరంలో విద్యార్థులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూలై 21: మండలంలోని చినకాపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇంటి వద్ద నుంచి విద్యార్థులు ఉల్లాసంగా వస్తున్నప్పటికీ పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురవుతున్నారు. గురువారం పాఠశాల ఆవరణలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ రాంబాబు, పెదకాపవరం పిహెచ్‌సి వైద్యులు రవికిరణ్‌రెడ్డి, ఆకివీడు, ఉండి, పెదకాపవరంలకు చెందిన వైద్య బృందాలు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాయి. వైద్యశిబిరం జరుగుతుండగానే తరగతి గదుల నుంచి 6,7,10 తరగతులకు చెందిన భాగ్యలక్ష్మి, ఆశాజ్యోతి, భూమిక, సతీష్, భవానీలు కళ్లుతిరిగి పడిపోవడంతో వీరిని ఉపాధ్యాయ బృందం శిబిరానికి తరలించారు. కళ్ల వెంబడి నీళ్లు కారడం, వాంతులవ్వడం వంటివి జరుగుతుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఒకరిని చూసి మరొకరు పడిపోతున్నారని వైద్యబృందం తెలిపింది. ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్, జడ్పీటీసీ మనే్న లలితాదేవి, వానపల్లి బాబూరావు, మర్రివాడ వెంకట్రావు, దారపురెడ్డి కనకయ్యలు శిబిరాలను సందర్శించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండటంతో విద్యాశాఖ రెండురోజుల పాటు పాఠశాలకు సెలవుప్రకటించింది.
ఎమ్మెల్యే ఆరా
చినకాపవరం పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26వ తేదీ మంగళవారం పాఠశాలకు న్యూరాలజిస్టు, సైక్రియాట్రిస్టుతోపాటు పలు వైద్యబృందాలను పంపి విద్యార్థులకు సేవలందించేలా చర్యలు చేపడతామని తెలిపినట్లు ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్ తెలిపారు.