పశ్చిమగోదావరి

ఎర్రకాలువ, తమ్మిలేరు ప్రాజెక్టుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూలై 21: చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలో ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టులను అనుసంధానం చేయనున్నట్టు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత వెల్లడించారు. మండలంలోని కొంగువారిగూడెం వద్ద శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలు ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువకు గురువారం మంత్రి సాగునీటిని విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు 15వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఎర్రకాలువ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువనుండి ఐదువేల ఎకరాలకు సాగునీరందించేందుకు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు చెప్పారు. ఈ కాలువ పొడిగింపుద్వారా మరో రెండు రోజుల్లో బయనేరు అక్విడెక్టుద్వారా రెండువేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న మూడు ప్రధాన డెల్టాలకు 12,200 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కోసం విడుదల చేసినట్టు తెలిపారు. ఈ నీటితో ఖరీఫ్‌సాగుకు సంబంధించి ఆకుమడులు, ఇతర పంటల సాగుపనులను చేసుకుని అధిక పంటలు పండించుకోవాలన్నారు. రైతాంగం అన్నివిధాలా సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. గోదావరిలో 2724 టిఎంసిల నీరు సముద్రంలో కలిసిపోతే నీరు వృథా అవుతుందని కృష్ణాజిల్లాలో నీటికి ఎదురు చూడవలసి వసుందన్నారు. ఈ పరిస్థితులు గమనించిన ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణం చేసి కృష్ణాడెల్టాకు నీటి ఇబ్బంది లేకుండా చూసారని అన్నారు. గత ఏడాది పట్టిసీమ ద్వారా 8.8 టిఎంసిల నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేశారన్నారు. దీని ద్వారా 2,500 కోట్ల రూపాయల విలువైన పంటలు పండించుకోగలిగారని అన్నారు. ఈ ఏడాది 8 టిఎంసిల నీరు ఇవ్వడం ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి నీరు అందించగలుగుతామని చెప్పారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా ఉంచాలని ముఖ్యమంత్రి కష్టపడి పని చేస్తున్నారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఎర్రకాలువ, తమ్మిలేరు ప్రాజెక్టుల అనుసంధానం చేసే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళతానని మంత్రి సుజాత చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ పథకం పూర్తిచేసి మెట్టప్రాంతంలో సాగునీటి కొరత లేకుండా సశ్యశ్యామలం చేస్తామన్నారు. జిల్లాలో మెట్టప్రాంతంలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపొందించినట్టు చెప్పారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, మరింత మెరుగైన అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. అనంతరం పూజలు నిర్వహించి ఎర్రకాలువ ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు వివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటిసి సభ్యుడు శీలం రామచంద్రరావు, ప్రాజెక్ట్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, జలవనరుల శాఖ ఎస్‌ఇ కె శ్రీనివాసరావు, ఇఇ ఆర్ సతీష్, డిప్యుటి ఇఇ ఆర్ ప్రసాద్, ఎఇలు కె శ్రీనివాసమూర్తి, ఇమ్మానియేలు, తహసీల్దార్ జివివి సత్యనారాయణ, ఎంపిడిఒ పి శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ లక్ష్మణరావు, అబ్బిన దత్తాత్రేయ, నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్‌కుమార్, రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.