పశ్చిమగోదావరి

పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఆగస్టు 4: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అంత్య పుష్కరాలు అయిదవ రోజు గురువారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వరద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుఝాము నుండీ భక్తులు తొలుత తక్కువ సంఖ్యలో వచ్చినా క్రమేణా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. గోదావరికి వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటివల్ల స్నానమాచరించేందుకు భక్తులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టంలో మెట్లపైకి వరద నీరు రావడంతో భక్తులు చెంబులతో నీళ్లుపోసుకుని స్నానమాచరించారు. గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. పిండ ప్రదాన క్రతువులు అధికంగా జరిగాయి. గోష్పాద క్షేత్రంలోని దేవాలయాల్లో భక్తులు విశేష సంఖ్యలో దైవ దర్శనం చేసుకున్నారు. ఇతర జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రైసు మిల్లర్స్ అసోసియేషన్‌కు చెందిన సింహాద్రి జనార్థనరావు, తాళ్లపూడికి చెందిన వాసవీ క్లబ్ యూత్ సభ్యులు భక్తులకు పులిహోర పంచిపెట్టారు. అయితే ఉదయం నుండీ వర్షం పడుతున్నా భక్తులు లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేయడం విశేషం.
పోలవరం: అంత్య పుష్కరాల సందర్భంగా పట్టిసం రేవులో గురువారం పుష్కర స్నానాలు తక్కువ సంఖ్యలోనే భక్తులు చేశారు. వర్షం కారణంగా భక్తుల సంఖ్య అంతంత మాత్రంగా ఉంది. పుష్కర స్నానం చేసిన భక్తులు వీరేశ్వరస్వామి దర్శనానికి లాంచీపై గోదావరి నది దాటి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఇదిలావుండగా గోదావరి నది నీటిమట్టం భారీగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్నానాలు చేసే ప్రదేశంలోని రక్షణగా పెట్టిన ఐరన్ మెస్‌లు గోదావరిలో మునిగిపోయాయి. దాంతో పట్టిసం, గూటాల రేవుల్లో పడవలపై ఉన్న గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. సిఐ బాలరాజు పట్టిసం రేవులో ఉండి గజఈతగాళ్లను భక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో పుష్కర స్నానమాచరించే భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంది. గురువారం మధ్యాహ్నం నుండి వర్షాలు తగ్గడంతో శుక్రవారం నుండి భక్తుల సంఖ్య అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.