పశ్చిమగోదావరి

కృష్ణా పుష్కరాలకు పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 6 : రానున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రీకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పూర్తి భద్రతా ఏర్పాట్లను చేపట్టిందని ఏలూరు రేంజ్ డి ఐజి పివి ఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం డి ఐజి పుష్కరాల ఏర్పాట్లపై ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పోలీసు అధికారులు, లారీ ఓనర్ల అసోసియేషన్ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డి ఐజి మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. దీనికి సంబంధించి పోలీసు శాఖ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలను చేపట్టిందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్లింపునకు ఏర్పాట్లు చేశామన్నారు. దీనిలో భాగంగా విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను ముందుగానే ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్నామని తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను సిద్ధాంతం, చించినాడ, బ్రిడ్జిల ద్వారా నర్సాపురం, కైకలూరు, గుడివాడ ప్రాంతాల నుంచి చీరాల, ఒంగోలు వైపునకు మళ్లిస్తున్నామన్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి భారీ వాహనాలను గుడివాడ వైపు మళ్లిస్తున్నామన్నారు. జిల్లాలో నర్సాపురం, భీమవరం, పాలకొల్లు వంటి పట్టణాల్లో ప్రత్యేక పోలీసు బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారన్నారు. అదే విధంగా అవసరమైన ప్రాంతాల్లో క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయాలు కలిగే అవకాశమున్నందున ఆ సమయంలో మరిన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా వుందని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా యంత్రాంగాలను కోరామన్నారు. అలాగే పుష్కర ఘాట్ల వద్ద వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ వద్దకు వెళ్లేందుకు క్యూమార్గాలను నిర్ధేశించామని, రేవు వద్ద సరిపడిన సంఖ్యలో యాత్రీకులను మాత్రమే లోనికి వదులుతామని చెప్పారు. పుణ్యస్నానాల అనంతరం వారు వేరే మార్గం ద్వారా బయటకు వస్తారని తెలిపారు. ప్రతీ ఘాట్ వద్ద సిసి కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. పశ్చిమలోని పోలీసు సిబ్బందిని పూర్తిస్థాయిలో కృష్ణా పుష్కరాల భద్రతా ఏర్పాట్లకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ పుష్కరాలు జరిగే రేవుల్లో ఎక్కడా సమస్యాత్మక ప్రాంతాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌బి డి ఎస్‌పి భాస్కరరావు, ఏలూరు డి ఎస్‌పి జి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డి ఎస్‌పి శ్రీనివాసరావులతోపాటు పలువురు సి ఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.

నిర్వాసితుల ఉపాధికి శిక్షణా శిబిరాలు

ఏలూరు, ఆగస్టు 6: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జీవనస్ధితిగతులు మెరుగుపర్చడానికి పదివృత్తుల్లో నాణ్యమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రెండు శిక్షణా శిబిరాలను త్వరలో ఏర్పాటుచేస్తామని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిరాశ్రయులయ్యే 514 గిరిజనేతర కుటుంబాలకు జంగారెడ్డిగూడెం సమీపంలో పెద్దఎత్తున ఇళ్లకాలనీ ఏర్పాటుచేస్తామని, యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చేందుకు జంగారెడ్డిగూడెం ఐటిఐలోను, కెఆర్ పురంలో ప్రత్యేక వృత్తి శిక్షణా కోర్సులలో ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. జిల్లాలో ఆరులైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టకుండానే ప్రజల నుండి టోల్‌గేట్ పన్ను గత నాలుగేళ్లలో రెండువందల కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఆ సొమ్మును రికవరీ చేసి జిల్లా అభివృద్ధికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటానని కలెక్టరు చెప్పారు. ఇటీవల విద్యార్ధులతో సర్వే నిర్వహించగా వారానికి 82లక్షల రూపాయలు కలపర్రు టోల్‌గేట్ వద్ద వాహనాల నుండి పన్ను వసూలు అవుతున్నట్లు తేలిందన్నారు. దీన్నిబట్టి ఏడాదికి 50కోట్ల రూపాయల చొప్పున నాలుగేళ్లలో 200కోట్ల రూపాయలు కేవలం టోల్‌గేట్ పన్ను వసూలు చేశారన్నారు. 24కోట్ల రూపాయలతో తమ్మిలేరు అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి డిజైన్లను ఆమోదించడంలో ఇరిగేషన్ శాఖ సిడిఓ గిరిధర్‌రెడ్డి ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారంరోజుల్లోగా డిజైన్లకు అనుమతులు మంజూరు చేయకపోతే చింతలపూడి ప్రాంత రైతులు హైదరాబాద్‌లోని సిడిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి సిద్దంగా ఉన్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే అనుమతులు మంజూరు చేయాలన్నారు.