పశ్చిమగోదావరి

దూసుకెళుతున్న సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికారత సర్వే ప్రక్రియ జిల్లాలో దూసుకెళుతోందనే చెప్పాలి. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం చూస్తే రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి మొదటిస్థానంలో నిలుస్తోంది. అన్ని మండలాల్లోనూ సర్వే ప్రక్రియ పరుగులు తీస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా సర్వే చేస్తూ ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మిగిలిన జిల్లాల్లో వున్న పరిస్థితి చూసుకుంటే జిల్లాలో దాదాపు రెట్టింపు మంది వివరాలను సర్వే ద్వారా సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 408786 కుటుంబాలకు సంబంధించిన 1132966 మంది వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి వాటిన ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. తొలిదశలో ఈ సర్వే సవాలక్ష అవాంతరాలతో మొదలైనా ఆ తరువాత క్రమంగా ఊపందుకుంటూ ప్రస్తుతం పరుగులు తీస్తోందని చెప్పాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, రెవిన్యూ అధికారులు సర్వే వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్న సమస్యలకు పరిష్కారాలను చూపిస్తూ ఈ ప్రక్రియ ముందడుగు పడేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా వున్న 48 మండలాల్లో ఈ సర్వే ప్రక్రియ ప్రస్తుతం పరుగులు తీస్తోంది. నెలాఖరు వరకు జరిగే ఈ సర్వేలో జిల్లాకు సంబంధించి ఉన్న కుటుంబాలు, అందులో వున్న వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచే అవకాశం కనిపిస్తోంది. మరోవిధంగా చూస్తే జిల్లాలో సర్వే పరుగులు తీస్తుంటే జిల్లా కేంద్రమైన ఏలూరు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ప్రధమస్థానంలో నిలుస్తోంది. ఏకంగా 22143 కుటుంబాలకు చెందిన 65741 మంది వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే విలీనమండలమైన కుకునూరు ఈ సర్వేలో చివరిస్థానంలో నిలుస్తోందని చెప్పాలి. ఈ మండలంలో ముగ్గురు ఎన్యూమరేటర్లు నాలుగు కుటుంబాలకు చెందిన 13 మంది వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చగలిగారు. ఏజెన్సీ, విలీన మండలాల్లో సర్వే ప్రక్రియ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అంత చురుగ్గా జరిగే అవకాశాలు సహజంగానే చాలా తక్కువ. ఈ ప్రాంతాల్లో ఎన్యూమరేటర్ల లభ్యత, కుటుంబాల అందుబాటు వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాగే భీమవరం ప్రాంతంలో కూడా ఈ సర్వే చురుగ్గానే ముందుకు సాగుతోంది. ఇక్కడ 18714 కుటుంబాలకు చెందిన 53780 మంది వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఆ తరువాత స్థానంలో తణుకు నిలుస్తుండగా ఇక్కడ 17746 కుటుంబాలకు చెందిన 49804 మంది వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. డెల్టా ప్రాంతంలో ఒక విధంగా చూస్తే ఈ సర్వే కొంత వేగవంతంగానే ముందుకు సాగుతున్నట్లు గణాంకాల బట్టి తెలుస్తోంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం సర్వే అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే తొలిదశ ఆటంకాలతో పోలిస్తే పెద్ద ఎత్తున ఊపందుకుందనే చెప్పాలి. ఇక ఆకివీడులో 11075 కుటుంబాలకు చెందిన 31350 మంది వివరాలను, దెందులూరు పరిధిలో 10058 కుటుంబాలకు చెందిన 27436 మంది వివరాలను, జంగారెడ్డిగూడెంలో 10270 కుటుంబాలకు చెందిన 28917 మంది వివరాలను, కొవ్వూరులో 13596 కుటుంబాలకు చెందిన 37936 మంది వివరాలను, నల్లజర్లలో 11973 కుటుంబాలకు చెందిన 34098 మంది వివరాలను, నర్సాపురంలో 10739 కుటుంబాలకు చెందిన 29504 మంది వివరాలను, నిడదవోలులో 10405 కుటుంబాలకు చెందిన 28058 మంది వివరాలను, పాలకొల్లులో 16219 కుటుంబాలకు చెందిన 45822 మంది వివరాలను, పెనుమంట్రలో 10555 కుటుంబాలకు చెందిన 28570 మంది వివరాలను, పెరవలిలో 11126 కుటుంబాలకు చెందిన 30790 మంది వివరాలను, పోడూరులో 11747 కుటుంబాలకు చెందిన 33687 మంది వివరాలను, తాడేపల్లిగూడెంలో 15878 కుటుంబాలకు చెందిన 42330 మంది వివరాలను, ఉంగుటూరులో 11119 కుటుంబాలకు చెందిన 30890 మంది వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఒకటి, రెండు మండలాలు మినహా మిగిలిన అన్ని చోట్ల సర్వే పూర్తయిన కుటుంబాల సంఖ్య పది వేలకు చేరువలో వుండటం విశేషం.