బిజినెస్

జిఎస్‌టి కమిషనర్‌గా బెహరీ అగర్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్ జోన్ జిఎస్‌టి, కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్‌గా బంకే బెహరీ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టింది హైదరాబాద్ జోన్ వరకే అయినప్పటికీ ఆయన తెలంగాణ మొత్తం జిఎస్‌టి, కస్టమ్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. దీనికి తోడు అదనంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జోన్ చీఫ్ కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 1985 ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు చెందిన అగర్వాల్ అనేక ప్రాంతాల్లో పని చేశారు. జిఎస్‌టి చట్టం తయారు చేయడంలోనూ ఆయన కీలక పాత్ర వహించారు. 2016లో నాలుగు అంచల జిఎస్‌టి ప్లాన్ రూప కల్పనకు సంబంధించి దేశ వ్యాప్తంగా 60 వేల మంది సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.