వరంగల్

మేడారంలో తగ్గని భక్తుల రద్దీ -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, ఫిబ్రవరి 24: మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం వేలాదిగా తరలివచ్చి తల్లులను దర్శించుకున్నారు. మండెమెలిగే పండుగ (మినీ జాతర) శనివారంతో ముగిసినప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం 30వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వన దేవతల గద్దెల వద్ద ఉదయం 7 గంటల నుంచే దర్శనానికి భక్తులు బారులు తీరారు. గద్దెల పైకి భక్తులు వెళ్లేందుకు పోటీపడి భక్తులు మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీ ఇంత ఇంతకు పెరుగుతుండడంతో తాడ్వాయి ఎస్సై రవీందర్ పోలీసులను అప్రమత్తం చేశారు. గద్దెల వద్ద భక్తులు భారీగా తరలిరావడంతో గద్దెల చుట్టూ తిరుగుతూ సిబ్బందికి సూచనలు ఇస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా భద్రత చర్యలు చేపట్టారు.
మేడారంలో ఆదివారం మొక్కులు
మేడారం మినీజాతర శనివారంతో ముగిసినప్పటికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, బెల్లం (బంగారం), కొబ్బరికాయలు నూతన వస్త్రాలు సమర్పించారు. జువ్వి చెట్టుకు పూజలు చేశారు.

రెడ్డి కార్పొరేషన్‌ను ప్రకటించాలి
రెడ్డి జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గోపు జైపాల్‌రెడ్డి
పరకాల, ఫిబ్రవరి 24: హన్మకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్స్‌లో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన రెడ్డి సర్పంచ్‌లకు 26వ తేదిన సన్మాన అభినందన కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు రెడ్డి జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గోపు జైపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పరకాలలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రెడ్డి జేఏసీ కో ఆర్డినేటర్ మాడుగుల పాపిరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా గోపు జైపాల్‌రెడ్డి హాజరైన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సన్మాన, అభినందన కార్యక్రమానికి రెడ్డి మంత్రు లు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రభు త్వం తక్షణమే రెడ్డి కార్పొరేషన్‌న ప్రకటించాలని, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ర కో కన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి, లింగాల నారాయణరెడ్డి, వీరారెడ్డి లక్ష్మీనర్సింహరెడ్డి, కాసర్ల రాజిరెడ్డి, చాడ రమణారెడ్డి, ముదిగంటి వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.
నేడు కాళేశ్వరానికి కలెక్టర్ రాక
మహదేవ్‌పూర్, ఫిబ్రవరి 24: మార్చి 3 నుండి 5వ తేదీ వరకు జరిగే మహశివరాత్రి జాతర ఏర్పాట్లపై కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి వారి ఆలయం లో సోమవారం (నేడు) జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశంకు రానున్నారు. మహశివరాత్రి సందర్భంగా తరలివచ్చే భక్తులకు సౌక ర్యం కల్పించే ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన రివ్యూ మీటిం గ్ తీసుకోనున్నారు. మహశివరాత్రికి కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు చత్తీస్‌గడ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు రానున్నారు. ఈ క్రమంలో ఆలయంలో ఇప్పటి వరకు పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గతం లో ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 25 కోట్లు కేటాయించగా వాటి పనుల నిర్మాణం కొంత నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రేపు వచ్చే జాతరకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారోనని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వేసవిలో నీటి ఎద్దటి లేకుండా చూడాలి
* ఫిల్టర్‌బెడ్‌లలో అకస్మిక తనిఖీలు
* మున్సిపల్ కమీషనర్ రవికిరణ్
వడ్డేపల్లి, ఫిబ్రవరి 24: రానున్న వేసవి కాలంలో నగర పాలక సంస్థ పరిథిలోని ప్రజలందరికి తాగునీటికి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ ఎన్.రవికిరణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం దేవన్నపేట, పెద్దమ్మగడ్డ, రెడ్డికాలనీ, వడ్డేపల్లి ప్రాంతాలలోని ఫిల్టర్‌బెడ్‌లు, సిసి రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ది పనులను అకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిథిలో జరగుతున్న అభివృద్ది పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌లో నీటి సరఫరా తీరుపై కింది స్థాయి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పెద్దమ్మగడ్డలోని కమ్యూనిటీ హాల్, రెడ్డి కాలనీలోని రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రానున్న వేసవిలో నగర పాలక సంస్థ పరిథిలోని ప్రజలందరికి సకాలంలో తాగునీరు అందించేందుకు అధికారులు తగు అప్రమత్తతతో ఉండాలని సూచించారు.అదే విధంగా నగరంలో తాగునీరు సరఫరా పైపులైన్ల లీకేజీలతో నీరు వృధా అవుతుందని, దానిని అధికారులు సకాలంలో స్పందించి లీకేజీలు అరికట్టి నీరువృధా కాకుండా చూడాలని ఆదేశించారు. నగరంలో జరగుతున్న అభివృద్ది పనులపై అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్దియా డిఇ రవికుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పర్యాటకులకు స్వర్గ్ధామం.. లక్నవరం

గోవిందరావుపేట, ఫిబ్రవరి 24: తెలంగాణా రాష్ట్రంలోనే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ప్రదేశాలలో మండలంలోని లక్నవరం అగ్రస్దానంలో నిలుస్తుంది. నిత్యం వేలాది మంది పర్యాటకులతో పర్యాటకులకు స్వర్గ్ధామంగా లక్నవరం పేరుగాంచింది. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగి లక్నవరం చెఱువుపై ఐలాండ్ ను అనుసంధానం చేస్తు ఇక్కడ ఊయల వంతెన నిర్మించడంతో ఓక్కసారిగా సూదూర ప్రాంతాల పర్యాటకులను లక్నవరం ఆకట్టుకుంది.