అవీ .. ఇవీ..

మందు...మగువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైన్ తాగడంలో కొత్తేముంది. వైన్‌లా కన్పించే వేడినీళ్లలో కూర్చుని అసలైన వైన్ తాగితేనే మజా అంటున్నారు ఈ అతివలు. టోక్యోలోని కోవాకిచన్ ఎన్స్‌న్ స్పాలో ఈ తరహా ఏర్పాట్లు చేశారు. రెడ్‌హాట్‌వాటర్ టబ్స్‌లో కూర్చుని వైన్ తాగితే అదో గమ్మత్తయిన అనుభవం అంటూ వినియోగదారులను ఆ స్పా ఆకర్షిస్తోంది. వైన్ ప్రారంభోత్సవం అనే వేడుక సందర్భంగా ఈ ఆఫర్‌ను ఆ స్పా ప్రకటించింది.

హాయి హాయిగా...
చలి చంపేస్తున్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో సేదదీరితే ఎలా ఉంటుందో ఈ కోతులను చూస్తే తెలుస్తుంది. జపాన్‌లోని జిగోకుందని మంకీపార్క్‌లో ఉన్న నీటుబుగ్గల్లోని వేడినీటిలో ఇవి సేదదీరుతున్నాయి. వీటిని చూసి పర్యాటకులు ఆనందంతో గంతేస్తున్నారు.

రోజుకో రూపం
ఈ ఫొటోలో వింతరూపంతో కన్పిస్తున్న కళాకారుడి పేరు మైఖేల్ గంప్. ఇతడు రోజూ ఓ కొత్త రూపంతో కన్పిస్తాడు. అయితే అది కళాత్మకంగా, వినోదాత్మకంగా ఉంటుంది. సంవత్సరంలో 365లూ ఏదో ఒక కొత్తరూపంతోనే దర్శనమిస్తాడు. తనకు తెలిసిన కొంతమందికి మాత్రమే ఏరోజుకు ఆరోజు తన కొత్త అవతారాన్ని చూపిస్తూంటాడు. మొదట్లో పదీపాతికమంది ఆయనను చూసేవాళ్లుండేవారు. ఇప్పుడు ఆయనను అభిమానించేవాళ్ల సంఖ్య వేలకు చేరిపోయింది. విభిన్న వేషాలతో, వినూత్న కళకు పేరుతెచ్చిన మైఖేల్ మామూలోడుకాదుసుమా...

లెగోబ్రిక్ షో
లెగో బ్రిక్స్‌తో భారీ కళాకృతులను నిర్మించి ఆకట్టుకుంటున్నారు ఆ దంపతులు. లండన్‌లో ఈ మధ్య జరిగిన లెగోషోలో వారు సంచలనం సృష్టించారు. టైటానిక్ ఓడ ఆకృతిని లక్షా 20వేల లెగోబ్రిక్స్‌తో రూపొందించిన వారు ఓ జానపద సీరియల్‌లోని భారీ ఏనుగు ఆకృతిని 40వేల లెగోబ్రిక్స్‌తో రూపొందించారు. అన్ని డైమెంట్, ఎడ్ డైమంట్ దంపతులకు ఈ తరహా కళలో మంచిపేరుంది. ఈ బొమ్మలు చూస్తే మనమూ ఔనంటాం మరి.

-భారతి