క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో జరుగుతున్న డేవ్ షుల్జ్ మెమోరియల్ ఇంటర్నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మల్లయోధులు అమిత్ కుమార్, సుశీల్ కుమార్ చెరొక పసిడి పతకంతో సత్తా చాటుకున్నారు. 66 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో సుశీల్ కుమార్, 55 కిలోల విభాగంలో అమిత్ కుమార్ ఈ పతకాలను కైవసం చేసుకున్నారు. అలాగే ఫ్రీస్టయిల్ ఈవెంట్ 55 కిలోల విభాగంలో రాహుల్ అవారే, 66 కిలోల విభాగంలో ప్రవీణ్ రాణా రజత పతకాలను సాధించగా, మహిళల ప్రీస్టయిల్ 55 కిలోల విభాగంలో బబిత కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత మల్లయోధులు అమెరికా రెజ్లర్లతో కలిసి కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఒలింపిక్ ట్రైనింగ్ సెంటర్‌లో గత నెల నుంచి శిక్షణ పొందుతున్నారు.
Add new comment