ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యాలు పూర్తి చేస్తారు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి సమస్యలున్నా పరిష్కరించుకుంటారు. న్యాయస్థాన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహన, విమాన ప్రయాణాలుంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం, ధనాదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. బంధుమిత్రుల సాయంతో సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. విలువైన ఆభరణాల ఖరీదు నందు అప్రమత్తత, నియంత్రణ అవసరం. జరిగిన వాటిని గురించి ఆలోచించవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
నిబద్ధతతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారులు చెప్పింది ఆలోచించి మరీ పూర్తి చేయండి. సిబ్బందితో ఇబ్బంది ఉంటే తెలియజేయండి. అధికారులకు మతిమరపు ఉంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్నింటా నిదానం ప్రధానం. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలందుకుంటారు. పనుల పట్ల ఆలస్యం కూడదు. శుభకార్యాలలో పాల్గొంటారు.
మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగులకు అనుకోని బదిలీలు, ప్రయాణాలుంటాయి. వదంతులు నమ్మకండి. మాటలాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు ఆలోచింపజేస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. విద్య, వృత్తి, వ్యాపార రంగాల వారు లబ్ధిని పొందుతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పొరపొచ్చాలు లేకుండా దంపతులు మెలగాలి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆలస్యంగానైనా హితుల దృష్టి మీపై ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
అనుకున్న పనులు అనుకోని విధంగా ఆలస్యంగానైనా పూర్తవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. విద్యార్థులు అందిన అవకాశాలను వినియోగించుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలు యోగిస్తాయి. సంప్రదింపులతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయ వ్యయాలు బేరీజు వేసుకోవాలి. దంపతులు చర్చలతో పరిష్కరించుకునే విషయాలు సఫలమవుతాయి. సహకార విధానంతో పనులు పూర్తి చేసుకోవటం ఉత్తమం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘసేవలో అనుకూల పరిస్థితులు ఉండి, ప్రత్యేక గుర్తింపును పొందుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆర్థిక లావాదేవీలు తృప్తికరం. ఉద్యోగులకు బదిలీలు, స్థల మార్పిడులు. ఆరోగ్య విషయాల్లో తృప్తికరంగా ఉన్నప్పటికీ ఔషధ సేవనం తప్పదేమో. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మేలు. ఆభరణాలతో ప్రయాణాలందు అప్రమత్తతతో మెలగాలి. అప్పుల విషయంలో సంయమనం చూపాలి. విందు వినోదాలందు మీ ఆరోగ్య నియమాలు పాటించండి. శుభవార్తలు, పత్రాలు అందుతాయి. సంతాన సౌఖ్యం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
అందిన సహకారంతో పనులు పూర్తి చేస్తారు. నిరంతర కృషితో ఉద్యోగులు, వ్యాపారస్థులు, విద్యార్థులు అనుకున్నవి సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలున్నాయి. ఆర్థిక లావాదేవీలు ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ కార్యాలందు మెళకువలు పాటించడం మేలు. శుభ వర్తమానాలు అందుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు మెరుగుపడతాయి. ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ఆలోచించండి. పరిచయాలు లాభాన్నిస్తాయి. ఇతరుల మాటలు, చేతలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. తృప్తికి మించిన శక్తి ఏమీ లేదని గ్రహిస్తారు.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
హితుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. పోటీ రంగాల వారికి మంచి సమయం. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, విద్య రంగాల వారు మెరుగైన ఫలితాలందుకుంటారు. ఆదాయ లావాదేవీలందు అప్రమత్తంగా ఉండాలి. దంపతులు ఉల్లాసభరితంగా గడుపుతారు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. విలువైన పత్రాలు, ఆభరణాలు అందుకుంటారు. ఆర్థికపరమైన పనులు పూర్తవుతాయి. పెద్దల సలహాలు మీకు ఉపకరిస్తాయి. అన్నింటా కంగారు పడకండి.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. వ్యవహారాలందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి లాభాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాలందు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగ, వ్యవసాయాల వారు పెద్దల సలహాలతో ముందుకు సాగుతారు. పొదుపు పథకాలతో అనుకున్నవి సాధిస్తారు. స్పెక్యులేషన్ తృప్తికరం. అధిక పైకంతో ప్రయాణాలు మంచిది కాదేమో ఆలోచించాలి. అపరాధాలు, అవరోధాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
అంచనాలు ఫలించటంతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రణాళికలు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలందు నియంత్రణ అవసరం. ఆస్పత్రులు, హోటల్, విద్య, వైద్య, ఉద్యోగ రంగాల వారు మెరుగైన ఫలితాలందుకుంటారు. దంపతులు అనవసర శ్రమకు లోనుకాకూడదు. పరీక్షా ఫలితాలందు శుభ పరిణామం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
రానున్న ఖర్చులకై నిధులను సేకరించుకుంటారు. ప్రయాణాలందు అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఆలస్యంగానైనా విలువైనవి సమకూర్చుకుంటారు. శుభ కార్య యత్నాలు అనుకూలిస్తాయి. పట్టుదలలకు పోకండి. ఇతరుల వ్యవహారాలందు దీర్ఘ దృష్టి అవసరం. విద్య, వ్యాపార, వృత్తులందు అప్రమత్తతతో ఉండాలి. మంచి ఫలితాలను అందుకుంటారు. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. పన్ను పోటు, వెన్నుపోటు ఇబ్బంది పెట్టవచ్చు. బృంద కార్యక్రమాలలో పాల్గొని గౌరవ మర్యాదలు మెరుగు పరచుకుంటారు.
కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
చక్కటి ఆలోచనా విధానంతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు ఆనందాన్నిస్తాయి. అనుకోకుండా పైకం చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఊపందుకుంటాయి. కుంటుపడిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అన్నీ శుభాలే. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వాంతన కలుగుతుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు సంపాదించుకోనున్నారు. దంపతులు లబ్ధిని పొందుతారు. స్పెక్యులేషన్ వాయిదా వేయడం మేలు.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాతావరణానికి అనుకూలంగానే ప్రయత్నాలు చేస్తారు. ఓ వార్త, పత్రం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అయిష్టతతో ఏ పనినీ మొదలుపెట్టకుండా ఉంటే మంచిది. ప్రమోషన్లు అంటేనే మెరుగైన కృషికి దర్పణమని గ్రహిస్తారు. ప్రయాణాలందు నియంత్రణ అవసరం. వ్యవసాయ కార్యాల్లో పెద్దల సహకారం ఉపకరిస్తుంది. దీర్ఘకాలిక లాభాలకై స్పెక్యులేషన్ అనుకూలం.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855