ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? (అక్టోబర్ 29 నుండి నవంబర్ 4 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆదాయం ఖర్చుల సమతుల్యత పాటించాలి. పైకం అనుకోకుండా ఆదాయానికి తోడ్పడుతుంది. శక్తికి మించే పనుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులే మిమ్మల్ని విమర్శించే పరిస్థితులు ఉన్నాయి. ఓర్పు వహించండి. అప్పులు చేయాల్సి రావచ్చు. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరుగనున్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్ మిశ్రమం. అనుకోని శుభాలలు అందుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విధి వైపరీత్యాలు కలవరపెట్టకుండా ప్రయత్నించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆర్థిక వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. అన్నింటా విజయావకాశాలు. ఎంచుకున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో చక్కటి ఫలితాలను అందుకుంటారు. సంబంధిత వారు ఇబ్బంది పెట్టాలనుకున్నప్పటికీ మీ లౌక్యంతో పరిస్థితులను అధిగమిస్తారు. పెట్టుబడులకు మంచి ప్రణాళికలు వేస్తారు. ముఖ్యమైన కార్యాలలో నిమగ్నమవుతారు. విదేశీ ప్రయణాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కీర్తి ప్రతిష్ఠలు రానున్నాయి. మంచి తరుణం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అర్థ, ఖర్చు నియంత్రణ మంచిది. చేసే కార్యాలందు అపశృతులు రాకుండా చూసుకోండి. ప్రభుత్వ కార్యానుకూలం. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. అదనపు పని భారం. అన్నింటిలోనూ ఆలోచనాత్మకంగా వ్యవహరించండి. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, సాంకేతిక రంగాలు అనుకున్న విధంగా ఉంటాయి. అనుకోని ప్రయాణ మార్పులుంటాయి. దూరపు బంధువుల రాక ప్రయోజనకారిగా ఉంటుంది. ఒక కార్యం గుర్తింపుని తెస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

శ్రమానుకూల ఫలితాలుంటాయి. లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమయానికి పైకం అందుతుంది. ఆస్తి వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల నిర్ణయాలను అంగీకరించండి. తొందరపాటు కూడదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులు గతం కంటె మందగించే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల సహాయం అందుతుంది. పెట్టుబడులు, ప్రణాళికలు ఫలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ఆర్థిక తృప్తి. అనవసర ఖర్చులుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ విలువలు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. హితులకు మీ సలహాలు ఉపకరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారది రంగలు, సాంకేతికంగా లబ్ధి పొందుతాయి. సామాజిక కార్యాలందు మీకు గుర్తింపు లభిస్తుంది. స్ర్తిలు నిర్వహించే కార్యక్రమాలు తృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలుంటాయి. అన్ని విషయాలలోనూ అతి ఆసక్తి కూడదు. కొన్ని పనులు చివరి క్షణంలో మార్పునకు గురవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ధన, సంతాన, ఉద్యోగ, విద్య ప్రయాణాలందు అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. స్థిర వసతులకై చేసే మీ యత్నాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. బృంద కార్యక్రమాలు, సాంకేతిక పరమైన, విలువైన వస్తువులు ఖరీదుకు అవకాశం. చేసే కార్యాలపై దృష్టి పెట్టండి. అన్య మనస్కంతో ఉండకండి. పొరపాట్లు దొర్లుతాయి. జాగ్రత్త. శుభాలు అందుతాయి.
తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అనుకున్న దాని కంటె మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక విషయాలు మార్పునకు గురయినా సర్దుబాట్లు, దిద్దుబాట్లు ఉంటాయి. తత్తరపాటు పడకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొన్ని ఇబ్బందులు గోచరించినా అంతిమ విజయం మీదే. రాజకీయ రంగాల వారికి మేలైన మార్గాలు విస్తరిసాతయి. శుభాలు అందుకుంటారు. ఫలితాల కోసం ఎదురుచూడకండి. అంతా మంచే జరుగుతుంది. ప్రయాణాలందు మెళకువ పాటించాలి. పెద్దలతో సంయమనం మేలు.
వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఈ వారం సమర్థవంతంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మీకు తృప్తినిస్తాయి. కొన్ని విషయాల్లో కాలహరణం జరిగే సూచనలున్నాయి. ఎంచుకున్న రంగాలలో సంతృప్తి కానవస్తుంది. అనుకున్న దైనందిన కార్యక్రమాలలో ఆలస్యం మిమ్మల్ని అసహనానికి గురి చేస్తుంది. శత్రుత్వం నశిస్తుంది. పెద్దల అండదండలు ఉపకరిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విధి వైపరీత్యాలు కలవరపెట్టకుండా ప్రయత్నించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు, వస్త్రాలు ఖరీదు చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
అన్ని విషయాల్లో సుఖ జీవనం. ఆర్థిక లోటుపాట్లు ఉండవు. ఇతరుల విషయాలలో ఆసక్తి పనికిరాదు. మీదైన విధానాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో గుర్తింపును తెచ్చి పెడతాయి. ఆస్తిపై పెట్టుబడులు, రాబడులున్నాయి. ఆధ్యాత్మిక కార్యాలు వికసిస్తాయి. అన్నింటిలోనూ ఆలోచనాత్మకంగా వ్యవహరించండి. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, సాంకేతిక రంగాలు అనుకున్న విధంగా ఉంటాయి. అనుకోని ప్రయాణ మార్పులుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. వాహన మార్పులున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతం కంటె బాగుంటాయి. కుటుంబ వ్యవహారాదులు ప్రణాళిక మేరకు నిర్వర్తిస్తారు. సంతాన సౌఖ్యప్రాప్తి. శుభ కార్య యత్నాలు విస్తరిస్తాయి. ఔషధ సేవనం తప్పదు. స్ర్తిలకు మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఒక వార్త మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.
కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అనుకున్న విధంగానే ఆర్థిక లావాదేవీలు సఫలీకృతమవుతాయి. శ్రమానుకూల ఫలితాలుంటాయి. ఆటంకాలను అధిగమిస్తారు. హితుల సాయంతో నిర్ణయాత్మకంగా ముందుకు వెళతారు. వృత్తి, వ్యాపార ఉద్యోగ రంగాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులు, శ్రీమతి మాటలకు విలువ నివ్వండి. వారి సలహాలు మీకు ఉపకరిస్తాయి. అపరిచితులు మీ వద్దకు వస్తే పరిశీలనాత్మకంగా ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. అన్నింటా గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో మీ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగకుండా మెళకువ పాటించండి. తొందరపాటుతనం కూడదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు గుర్తింపును పొందుతారు. చికాకులు, పరాకులు లేకుండా వ్యవహరించండి. శక్తికి మించి పనులు చేయకండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855