యువ

మడతేస్తే సూట్‌కేస్ లేదంటే...స్కూటర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు స్పేస్ మేనేజ్‌మెంట్‌పైనే అందరి దృష్టీ! ఏ వస్తువైనా స్పేస్‌ను తక్కువగా వినియోగించుకునేలా ఉండాలి. అదే వస్తువు ఉభయతారకంగా ఉంటే మరీ మంచిది. ఆ కోవలోకే వస్తుంది-ఇఫోల్డీ. ఇదో చిన్న స్కూటర్ కమ్ సూట్‌కేస్! అదెలా కుదురుతుందనేగా మీ సందేహం? ఈ అసాధ్యాన్ని లండన్‌కు చెందిన తండ్రీకూతుళ్లు జియాన్‌మిన్, సుమీవాంగ్ సుసాధ్యం చేశారు.
వీళ్లిద్దరూ కలసి తయారు చేసిన ఇఫోల్డీ... ఓ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది శక్తిమంతమైన రెం డు బ్యాటరీల సాయంతో గంటకు నాలుగు మైళ్ల వేగంతో వెడుతుంది. 19 కేజీల బరువుండే ఇఫోల్డీ...150 కేజీల బరువు వరకూ మోస్తుంది.
మిగతా సమయాల్లో... దీన్ని మడత పెట్టేస్తే క్యారీ ఆన్ సూట్‌కేసుగా మారిపోతుంది. ఫోటోలో చూస్తున్నారుగా! విమానాల్లో వెళ్లే వారికి ఇదెంతో ఉపయోగం క దూ! అన్నట్టు...ఇటీవల బర్మింగ్‌హామ్‌లో జరిగిన గాడ్జెట్ షో లైవ్ ఎగ్జిబిషన్‌లో బ్రిటిష్ ఇనె్వంటర్స్ ప్రాజెక్ట్ అవార్డును అందుకుంది ఇఫోల్డీ. దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కిక్‌స్టార్టర్ క్యాంపెయిన్ ఇటీవలే మొదలైంది. ఇఫోల్డీ ధర వెయ్యి డాలర్లు ఉండొచ్చని అంచనా.
*
ఫోటోలో చూస్తున్నారుగా! విమానాల్లో వెళ్లే వారికి ఇదెంతో ఉపయోగం కదూ! అన్నట్టు...ఇటీవల బర్మింగ్‌హామ్‌లో
జరిగిన గాడ్జెట్ షో లైవ్ ఎగ్జిబిషన్‌లో బ్రిటిష్ ఇనె్వంటర్స్ ప్రాజెక్ట్ అవార్డును అందుకుంది ఇఫోల్డీ. దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కిక్‌స్టార్టర్ క్యాంపెయిన్ ఇటీవలే మొదలైంది.