యువ

సైబర్ పోరులో మన యొధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ విస్తృతమవుతున్న కొద్దీ, భద్రత కూడా పెను సవాల్‌గా పరిణమిస్తోంది. సెల్ ఫోన్ మొదలుకుని, టాబ్లెట్, ఐప్యాడ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో మనం నిక్షిప్తం చేసే సమాచారం ఎంతవరకూ సేఫ్? అది ఇతరుల చేతిలో పడితే జరిగే పరిణామాలేమిటి అనే ప్రశ్నలు మన ల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. మరోవైపు హ్యాకింగ్ మహమ్మారి పొంచి ఉండనే ఉంది. సమాచారాన్ని తస్కరించే హ్యాకర్ల బెడద దేశదేశాలనే వణికిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎవరి సమాచారాన్ని వారు భద్రపరచుకునేందుకు, ఇతరుల చేతిలో పడకుండా ఉండేందుకూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ నేపథ్యంలో వయసులో చిన్నయినా సైబర్ సెక్యూరిటీ దిశగా దృష్టి సారించి ఆ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు బోయిని మవిక, అనుమకొండ రవితేజ.
రెండు పదుల వయసైనా దాటని ఈ చిన్నారులు ఇటీవల గూగుల్ వెబ్ రేంజర్స్ పోటీలో గెలుపొంది అందరి దృష్టినీ ఆకర్షించారు.
సురక్షిత ఇంటర్నెట్
హైదరాబాద్‌లోని నజర్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది మవిక. సురక్షిత ఇంటర్నెట్ వాడకంపై ఇంత చిన్న వయసులోనే ఎన్నో ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకంలో టీనేజర్లు చేస్తున్న తప్పులు, వాటివల్ల తలెత్తుతున్న దుష్ఫలితాలను గమనించిన మవిక ‘సేఫ్ ఇంటర్నెట్ యూజ్’పై తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా ఓ ప్రాజెక్ట్‌ను తయారు చేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అకౌంట్లు తెరిచే యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది. పదహారేళ్ల మవిక చేసిన ఈ కృషికి గూగుల్ నుంచి ప్రశంసాపత్రం లభించడం విశేషం.
పాస్‌వర్డ్ పదిలం
చిరేక్ పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్న పదిహేడేళ్ల రవితేజ సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎలా క్రియేట్ చేయాలనే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నాడు. ‘నా స్నేహితుడు రౌనక్ మహాపాత్రతో కలసి సేఫ్ పాస్‌వర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలనే విషయంపై ఓ వీడియో తయారు చేశాను. నిజానికి పాస్‌వర్డ్స్ రూపొందించడమనేది ఓ సంక్లిష్టమైన ప్రక్రియ. కొన్ని వెబ్‌సైట్లు కేవలం అంకెలే పాస్‌వర్డ్‌గా ఉండాలంటాయి. మరికొన్ని కేపిటల్ లెటర్సే ఉండాలంటాయి. పాస్‌వర్డ్‌ను ఎలా క్రియేట్ చేయాలి? దానిని ఎలా గుర్తుంచుకోవాలి వంటి విషయాలపై మా వీడియోలో సూచనలు, సలహాలు ఇచ్చాం’ అంటూ వివరించాడు రవితేజ. *