యువ

పనెగ్గొట్టారో..పట్టేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటి వరకూ ఇంటి పనులూ, ఇతర వ్యక్తిగత అవసరాలు తీర్చే రోబోల గురించే విన్నాం! మరిన్ని సాంకేతిక హంగులతో, అన్నింటికీ మించి ‘తెలివితేట’లతో ఓ సరికొత్త రోబోను పరిశోధక బృందం సృష్టించింది. ఈ రోబో అన్ని విధాలా మనిషి కంటే తెలివైనదేనని, టెక్నాలజీ సాయంతో అన్ని రకాల సంక్లిష్ట పనుల్నీ చేసేస్తుందని చెబుతున్నారు. ఇలాంటి రోబోలు అందుబాటులోకి వస్తే..మేనేజర్ పనులూ చేయగలిగితే కంపెనీలు ఆగుతాయా! బెట్టిగా ముందుకొస్తున్న ఈ రోబో ఏకంగా ట్రైనీ ఆఫీసు మేనేజర్‌గా విధుల్ని నిర్వహించబోదోందట. అయితే ఈ విధుల్ని బెట్టి ఎలా నిర్వరిస్తుందో చూసేందుకు రెండు నెలల పాటు దీనికి శిక్షణా కార్యక్రమాన్ని పెట్టారు. యునైటెడ్ కింగ్‌డంలోని ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలకు సంబంధించిన ఓ ఆఫీసులో ఈ రోబో ఫ్రంట్ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. అంటే వచ్చే వారిని ‘విష్’చేస్తూ వారికి ఆహ్వానం పలుకుతుందన్న మాట. కేవలం వచ్చేవారిని, వెళ్లే వారినీ గమనించడమే కాకుండా ఈ రోబో మొత్తం ఆఫీసంతా కలియతిరుగుతుంది. పని వేళల్లో ఎంత మంది ఆఫీసులో ఉన్నారు..ఎంత మంది బయట తిరుగుతున్నారన్న విషయాన్నీ ఇది గమనిస్తుందట! అలాగే ఆఫీసు నిశ్శబ్ధంగా ఉందా, ఎంత మేరకు ఉష్ణోగ్రత ఉంది, అలాగే పని పరిస్థితులు అన్ని విధాలుగా సిబ్బందికి అనుకూలంగా ఉన్నాయో లేదో కూడా ఈ రోబో గమనిస్తుందట. ఇంతకీ ఇన్ని తెలివైన పనుల్ని ఈ రోబో ఎలా చేయగలుగుతుందో తెలుసుకోవాలంటే..ఇందులో అమర్చిన టెక్నాలజీ గురించి తెలియాలి. ఇందులో కృత్రిమ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అమర్చారు. ప్రత్యేకంగా ఈ రోబో కోసమే ఈ రకమైన సాఫ్ట్‌వేర్‌ను శాస్తవ్రేత్తలు రూపొందించగలిగారు.తనకు అప్పగించిన పనుల్ని సునాయాసంగా చేయడానికి వీలుగా ఈ సాఫ్ట్‌వేర్ ‘బెట్టి’కి తోడ్పడుతుంది. అంతే కాదు, ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో ఇతర పనుల్ని కూడా ఇది చేసేయగలుగుతుందని చెబుతున్నారు.
*