యువ

నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాకు మొట్టమొదటి నుంచి బ్యాక్ బెంచ్‌లో కూర్చోవడమే ఇష్టం. ఎందుకో తెలియదు. చాలాసార్లు మొదటి బెంచ్‌లో కూర్చోవాలనుకున్నా అది సాధ్యం కాలేదు. అయితే చివరి బెంచ్‌లో కూర్చున్నా, టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటాను. ఆ తరువాత పాఠ్య పుస్తకాన్ని తిరగేస్తాను. అంతే.. పాఠం మొత్తం గుర్తుండిపోతుంది’- జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించిన విజయవాడ కుర్రాడు జీవితేశ్ మాటలివి. తన చదువుల ప్రస్థానాన్ని, జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో విజయ రహస్యాన్ని అతను ‘ఆంధ్రభూమి’తో పంచుకున్నాడు.
జీవితేశ్ తన ప్రాథమిక విద్యను విజయవాడలోని నలంద విద్యానికేతన్‌లో పూర్తి చేశాడు. ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ మొగల్రాజపురంలోని నారాయణ ఒలంపియాడ్స్‌లో చదివాడు. టెన్త్‌లో 9.8 మార్కులు సాధించిన జీవితేశ్‌లోని మేథాశక్తిని నారాయణ యాజమాన్యం గుర్తించి హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య, నారాయణ ఐఐటి అకాడమి క్యాంపస్‌కు అతనిని తీసుకువెళ్లింది. అలుపెరగని కృషి, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చదివిన జీవితేశ్ జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించి ఇటు నారాయణ యాజమాన్యానికి, తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాడు.
జీవితేశ్ తండ్రి శివకుమార్ విటిపిఎస్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. జీవితేశ్ తన తండ్రిపై వత్తిడి తెచ్చి, తన ఇంటి వద్ద ఉన్న గ్రంథాలయంలో సభ్యునిగా చేరాడు. అందులో మ్యాజిక్‌పాట్, హ్యారీపోటర్‌తోపాటు కామిక్ పుస్తకాలు కూడా ఇష్టంగా చదవేవాడు. తరగతి గదిలో తను విన్నదానిని ఇంటికి వచ్చిన తరువాత మననం చేసుకునేవాడు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాన్ని ఎప్పుడూ మరిచిపోనంటాడు జీవితేశ్. అందులోనే పాఠం సారాంశం అంతా దొరుకుతుందని అంటాడు. ఇంటి దగ్గర కేవలం ఒక గంట పాటు మాత్రమే పాఠాలను చదవే జీవితేశ్, మిగిలిన సమయాన్ని నవలలు చదవడం, టివి చూడ్డానికే కేటాయించేవాడు. తన చెల్లికి పాఠాల్లో డౌట్స్ ఏమైనా ఉంటే, నివృత్తి చేసేవాడు. జీవితేశ్‌కు స్నేహితులు కూడా పెద్దగా లేరు. అమ్మ, నాన్న, చెల్లి.. ఆ తరువాత పుస్తకాలే అతడికి స్నేహితులు..హితులు. ప్రాథమికోన్నత విద్య చదువుతున్నప్పుడు మ్యాథ్స్ ఒలంపియాడ్స్‌లో రాణించాడు. పుణె, ముంబై, కోల్‌కతాలలో జరిగిన ఒలంపియాడ్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఇంటర్మీడియట్‌లో చేరిన తరువాత రోజుకు 10 గంటలపాటు చదువుపైనే దృష్టి పెట్టేవాడు. జీవితేశ్ మ్యాథ్స్‌లో జమ్. ఫిజిక్స్‌లోనూ అంతే. ఎటొచ్చీ కెమిస్ట్రీ అంటేనే భయం. ఆ సబ్జెక్ట్‌నే సవాల్‌గా తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. వారానికి రెండుసార్లు కళాశాల్లో పరీక్షలు నిర్వహించేవారు. మొదట కెమిస్ట్రీలో కొంత వెనకబడినా, తరువాత దానిపై పట్టు సాధించాడు. కళాశాలలో వారం వారం నిర్వహించే పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులే తనలో ధైర్యాన్ని నింపాయని, జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో కచ్చితంగా 50 లోపు ర్యాంక్ సాధించగలనన్న నమ్మకం కలిగిందని జీవితేశ్ చెప్పాడు. నాలుగో ర్యాంక్ రావడం తనకెంతో ఆనందం కలిగిస్తోందన్నాడు.
స్కూల్‌లో ఉన్నప్పుడు అమ్మ గోమతి తనయుడి చదువుపై శ్రద్ధ తీసుకున్నారు. ఆ తరువాత తండ్రి శివకుమార్ తనను ఇంజనీర్ చేయాలన్న పట్టుదలతో ప్రతి క్షణం నన్ను గమనిస్తూ, పాఠ్యాంశాల్లో వచ్చే డౌట్స్‌ను నివృత్తి చేసేవారని చెప్పాడు. ఇంటర్మీడియట్‌లో 980కి పైగా మార్కులు సాధించిన జీవితేశ్ ఏపిఎంసెట్‌లో 87వ ర్యాంక్, తెలంగాణ ఎంసెట్‌లో 35వ ర్యాంకు సాధించాడు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన జీవితేశ్ ముంబై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నాడు. భవిష్యత్‌లో కంప్యూటర్స్‌పై రీసెర్చ్ చేయాలనుకంటున్నానని జీవితేష్ చెప్పాడు.
లక్ష్య సాధనకు కష్టపడి చదవాల్సిందే. విద్యార్థులు లక్ష్యాన్ని సులభంగా చేధించాలంటే పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా నమ్ముకోవాలి. పాఠ్య పుస్తకం మన కళ్ళలో కదలాడేటట్టు చేసుకుంటే.. పరీక్షల్లో కళ్లు మూసుకుని నిర్మలంగా ఆలోచిస్తే, జవాబు దానంతట అదే దొరుకుతుందని అంటున్నాడు జీవితేశ్.

చిత్రం తల్లిదండ్రులు, సోదరితో జీవితేశ్

-కెవిజి శ్రీనివాస్