యువ

ఇవీ గాడ్జెట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకరకాల గాడ్జెట్లు...కొన్ని ఫిట్‌నెస్ గాడ్జెట్లు...మరికొన్ని ఆరోగ్య సంరక్షణకు పనికొచ్చే గాడ్జెట్లు...ఇంకొన్ని స్పోర్ట్స్ గాడ్జెట్లు. ఇలా దైనందిన జీవితంలో అన్నీ మనకొచ్చే గాడ్జెట్లే. అయితే కొన్ని సరదా గాడ్జెట్లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంది. అలాంటి గాడ్జెట్ల గురించి చూద్దాం...

పొగ పనిపడుతుంది!
Roost Smart Battery
స్మోక్ అలారమ్‌కు సంబంధించిన పరికరమిది. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో స్మోక్ అలారమ్స్ ఏర్పాటు చేసుకుంటాం. కానీ అది పనిచేయకపోతే? అప్పుడే పనికొస్తుంది రూస్ట్ స్మార్ట్ బ్యాటరీ. వైఫైతో నడిచే ఈ బ్యాటరీ...స్మోక్ అలారమ్ పనిచేయకపోతే స్మార్ట్ఫోన్‌కి వార్నింగ్స్ పంపుతుంది.

పాప ఎందుకేడ్చిందీ?
Baby GiGl
పైన పాలపీక గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు పాలసీసా గురించి చెప్పుకుందాం. ఇదొక స్మార్ట్ బేబీ బాటిల్ మానిటర్. పాప పాలు ఎన్ని తాగిందో చెప్పే గాడ్జెట్ అన్నమాట. అలాగే సీసాలో ఎవైనా అడ్డుపడి, పాపకు పాలు అందకపోతే మనల్ని అలెర్ట్ చేస్తుంది కూడా. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ బాటిల్ ధర వంద డాలర్లట.