యువ

ఇదీ కారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెనడాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎలెక్ట్రా మెకానికా ఓ వినూత్నమైన కారుతో మార్కెట్లోకి రాబోతోంది. ఈ కార్ పేరు సోలో. పేరును బట్టే చెప్పేయొచ్చు ఇందులో ఒక్కరే ప్రయాణించే వీలుంటుందని. మరో విశేషమేమంటే...ఇది మూడు చక్రాల కారు. బ్యాటరీతో నడిచే సోలో గంటకు 120కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. చూడటానికి బూటు ఆకారం లో ఉండే ఈ కారులో ఎల్‌సిడి డిస్‌ప్లే, బ్లూటూత్, యుఎస్‌బి, సిడి ఇన్‌పుట్ వంటి సౌకర్యాలన్నీ ఉంటాయట. సోలో ధర 15,300 డాలర్లట.

దోమలతో ఎల్జీ ఫైట్

టీవీ ఆన్ చేస్తే దోమలు పరార్
దోమలు కుడితే మలేరియా, జికా, డెంగీ వంటి వ్యాధులు సోకుతాయి. మరి అవి సోకకుండా ఉండాలంటే దోమల్ని రాకుండా చేయాలి. అంటే మస్కిటో రిపెల్లెంట్స్ కొనుక్కోవాలి. అయితే ప్రఖ్యాత ఎల్జీ కంపెనీ మాత్రం దోమలు రాకుండా ఉండాలంటే తమ టీవీలు కొనుక్కోమంటోంది.
నిజమే. ఎల్జీ ఇటీవలే దోమల్ని దూరం చేసే టెక్నాలజీతో రూపొందించిన టీవీలను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. టీవీ ఆన్ చేస్తే అల్ట్రాసోనిక్ తరంగాలు విడుదలై, ఒక రకమైన ధ్వనిని పుట్టిస్తాయి. వీటిని తట్టుకోలేక దోమలు పారిపోతాయట. ‘ఈ ధ్వని తరంగాలు మనిషికి వినబడనంత మంద్రంగా ఉంటాయి.) మరి టీవీ ఆఫ్ చేస్తే, దోమలు తిరిగి వచ్చేస్తాయనేగా మీ డౌట్! టీవీని ఆఫ్ చేసినా, ఈ టెక్నాలజీ మాత్రం పనిచేస్తూనే ఉంటుందట. రెండు మోడల్స్‌లో దొరికే ఈ టీవీల ధర 26,500, 47,500 రూపాయలు.