యువ

మొక్కే కదాని వదిలేస్తే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Parrot Pot
పేరు చెప్పగానే ఇదేదో చిలకల్ని పెంచుకునేందుకు ఉపయోగపడే పరికరమని అనుకునేరు. మొక్కల్ని పెంచుకునేందుకు పనికొచ్చే కుండీ ఇది. కాకపోతే హైటెక్ కుండీ అని చెప్పొచ్చు. ఈ కుండీలో రెండు లీటర్ల నీళ్లు, మరో రెండు లీటర్ల మట్టిని వేసి మొక్కని నాటండి. ఈ నీరు, మట్టి మిశ్రమం గురించి ప్రతి 15 నిమిషాలకీ మీకు ఈ పారట్ పాట్ నివేదిక (స్మార్ట్ఫోన్‌కి మెసేజ్ రూపంలో) పంపిస్తుంది. అలాగే టెంపరేచర్, గాలి, వెలుతురు ఎలా ఉన్నాయో కూడా చెబుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీ మొక్కకు ఈ పారట్ పాట్ శ్రీరామరక్ష అన్నమాట.

గాల్లో తేలినట్టుందే!
Rocketskates
స్కేటింగ్‌పై మోజు ఉన్నవాళ్లకి మరింత కిక్ ఇచ్చే స్కేట్స్ ఇవి. మోటార్ అమర్చిన ఈ స్కేట్స్‌ను కాళ్లకు కట్టుకుని జామ్మని దూసుకుపోవడమే. గంటకు 10 మైళ్ల వేగంతో వెళ్లే ఈ రాకెట్‌స్కేట్స్ కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నాయట.