యువ

బొమ్మరిల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి పని, వంట పనిలో సాయం చేసే హ్యూమనాయిడ్ రోబోలు కొత్తేం కాదు. ఒక దాని తర్వాత ఒకటిగా ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నవి మాత్రం కొనే్న. అద్భుతాలు సృష్టించే మరికొన్ని రోబోలు రాబోయే కాలంలో రానున్నాయి. బడా కంపెనీలు మొదలు నిన్న మొన్న దుకాణం తెరిచిన కిక్‌స్టార్టర్స్ వరకూ హ్యూమనాయిడ్ రోబోలకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి, దానికి అనుగుణంగా వాటి తయారీలో మునిగి తేలుతున్నాయి. అలాంటి వాటి గురించిన కథా...కమామీషు మీకోసం..!
**
పెప్పర్
ఇతర హ్యూమనాయిడ్ రోబోలకంటే పెప్పర్ ఓ అడుగు ముందుందనే చెప్పాలి. జపాన్‌లో పుట్టిన పెప్పర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. పెప్పర్ ఇంట్లో ఉంటే ఓ మనిషి ఇంట్లో ఉన్నట్టే. ఇది మాట్లాడుతుంది. ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. మనుషుల హావభావాలను పసిగట్టి, ప్రతిస్పందిస్తుంది. తనంతట తానుగా ఇల్లంతా కలియదిరుగుతుంది.

జెన్బో
రెండు అడుగుల ఎత్తుతో చక్రాల ఆధారంగా ఇల్లంతా కలియదిరిగే జెన్బో చూస్తుంది..మాట్లాడుతుంది...వింటుంది. ఒక విధంగా జెన్బో ఇంట్లో ఉంటే నాలుగేళ్ల పిల్లాడు ఇంట్లో ఉన్నట్టే. జిబోలాగే ఇది కూడా పిల్లలకు కథలు చదివి వినిపిస్తుంది. పెద్దవాళ్లకు ఆసరాగా ఉంటుంది. కావలసినట్టు ఫోటోలు తీసిపెడుతుంది. అంతెందుకు? మాటకు మాట సమాధానం చెబుతుంది కూడా. జెన్బో ధర సుమారు 600 డాలర్లు.

జిబో
మొట్టమొదటి ఫ్యామిలీ రోబోగా జిబోను చెప్పుకోవచ్చు. ఇల్లంతా బిరబిరా తిరుగుతూ అందరితో మాటా మాటా కలుపుతూ పిల్లలతో కలసిపోయి ఆడి పాడే రోబో ఇది. జిబో... ఫోటోగ్రాఫర్ కమ్ వీడియో మేకర్ కూడా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నారులకు కథలు చెబుతుంది. ఇటి యజమానికి తలలో నాలుకలా వ్యవహరిస్తుంది. రానున్న ఈవెంట్ల గురించి అలెర్ట్ చేస్తుంది. వెబ్‌లోంచి మెసేజ్‌లు చదివి వినిపిస్తుంది.

ఎక్స్‌పీరియా ఏజెంట్
జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ సోనీ రూపుదిద్దుతున్న ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబో- ఎక్స్‌పీరియా ఏజెంట్. పైన చెప్పిన జిబో, జెన్బోలాంటి ఫీచర్లతోపాటు స్మార్ట్ హోమ్‌ను కంట్రోల్ చేసే తెలివితేటలు దీని సొంతం. ఎవరైనా ఇంటికి వస్తే స్వాగతం చెబుతుంది. వెంటనే లైట్లు ఆన్ చేస్తుంది. స్మార్ట్ హోమ్‌ను ఆపరేట్ చేయగలుగుతుంది. ఇందులో ఓ ఇంటిగ్రేటెడ్ కెమెరాను కూడా పొందుపరుస్తున్నట్టు సోనీ చెబుతోంది.

ఫ్యురో-ఐ
జిబో, జెన్బోలాంటి రోబోనే ఫ్యురో-ఐ కూడా. వీడియో కాలింగ్, మాట్లాడటం వంటివన్నీ చేస్తుంది. ఫ్యురో-ఐకి శామ్‌సంగ్ టాబ్లెట్ అమర్చడం అదనపు ఆకర్షణ. కాబట్టి నడిచే కంప్యూటర్ మీ వద్ద ఉన్నట్టే. పైపెచ్చు, ఫ్యురో-ఐ సెక్యూర్ అనే మరో రోబో కూడా ఉంది. ఫ్యురో-ఐకి ఉన్న ఫీచర్లతోపాటు ఇంటికి కాపలా కాయడం దీని ప్రత్యేకత. ఇంటి చుట్టూ పెట్రోలింగ్ చేస్తుందన్నమాట.

ఎయిడో
ఈ రోబోను స్మార్ట్ హోమ్ బట్లర్‌గా అభివర్ణిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఇంజెన్ డైనమిక్స్ తయారు చేసిన ఎయిడోలో వైఫై, మైక్రోఫోన్స్, స్పీకర్లు, ప్రొజెక్టర్, వాయిస్ రికగ్నిషన్, సెన్సర్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. పిల్లలకు పియానో నేర్పుతుంది. వంట గదిపై ఓ కనే్నసి ఉంచుతుంది. స్మార్ట్ డివైస్‌ను ఇట్టే ఆపరేట్ చేస్తుంది. రాత్రి ఇంట్లో అంతా పడుకున్నాక, ఇంటికి కాపలా కాస్తుంది. ఎయిడో వచ్చే అక్టోబర్‌లో ఎయిడో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.