యువ

వెలుగుల ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిపేది సైకిలే అయినా బైక్ నడుపుతున్న ఫీలింగ్ కావాలా? అయితే త్వరలో మార్కెట్లోకి రానున్న సైక్లోట్రాన్ సైకిల్‌ను కొనుక్కోవలసిందే. మరోమాటలో చెప్పాలంటే...సైకిళ్ల రంగంలో ఇదో విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలుకుతున్న సైకిల్. ఆధునిక టెక్నాలజీ సాయంతో తయారైన సైక్లోట్రాన్‌లో కేవలం షేప్ మాత్రం సైకిల్‌లా ఉంటుందంతే. మిగతా పార్టులేవీ ఉండవు. ఉదాహరణకు చక్రాలుంటాయి గానీ, వాటికి హబ్‌గానీ, స్పోక్స్ గానీ ఉండవు. టైర్లు ఉంటాయి గానీ అవి ఎయిర్‌లెస్! ఇక చక్రాలు ఎల్‌ఇడి లైట్లతో వెలిగిపోతూ ఉంటాయి. అంతేనా? బైక్‌పై వెడుతుంటే, సైకిల్‌లో అమర్చిన లేజర్ బైక్ లైన్ ప్రొజెక్టర్ వల్ల ఇరువైపులా లేజర్ లైట్ ప్రసరిస్తూ ఉంటుంది. దీనివల్ల సైకిల్‌పై వెళ్లే వారు లైన్ తప్పకుండా ఉండొచ్చన్నమాట. సైక్లోట్రాన్‌లో మరో ప్రత్యేకత - 18 ఇ గేర్ స్పీడ్ బాక్స్. మొత్తం బాడీ అంతా కార్బన్ ఫైబర్‌తో తయారైంది. ఆండ్రాయిడ్ యాప్‌తో దీనిని అనుసంధానించడం వల్ల ఎంతసేపు సైకిల్ నడిపాం, ఎన్ని కాలరీలు ఖర్చయ్యాయి వంటి వివరాలనూ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి, ప్రయోగ దశలో ఉన్న సైక్లోట్రాన్ మార్కెట్లోకి రావడానికి మరి కాస్త పట్టే అవకాశం ఉంది.