యువ

గిరిజనానికి ఆమె అండాదండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినూత్నంగా ఆలోచిస్తూ.. కొత్తరంగాన్ని ఎన్నుకుని ధీరోదాత్తంగా ముందడుగు వేసేవారు ఈ కాలంలో తక్కువే. ఆ కోవకు చెందిన ధీరవనిత దివ్య శ్రీవాత్సవ.
దివ్య కార్పొరేట్ ఉద్యోగి. ప్రేమించి పెళ్లిచేసుకుని గృహిణిగా, ఉద్యోగిగా, ముద్దులొలికే బిడ్డకు తల్లిగా హాయిగా బతికేస్తున్న దివ్య జీవితాన్ని సామాజిక సేవ చేయాలనే తపన కొత్త మలుపు తిప్పింది.
విభిన్నంగా ఆలోచించే తత్వం ఉన్న దివ్య విహారయాత్ర కోసం రాజస్థాన్‌లోని రణథంబోర్ వచ్చినపుడు ఓ దివ్యమైన ఐడియా వచ్చింది. కొత్త సవాల్‌ను ఎదుర్కోవాలనుకుంది. కార్పొరేట్ డైటీషియన్ ఉద్యోగానికి, నివసిస్తున్న మహానగరానికి గుడ్‌బై చెప్పి.. రాజస్థాన్ మారుమూల ప్రదేశంలో అరుదైన హస్తకళల కేంద్రం.. ధోంక్.. ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
యువ జీవ శాస్తవ్రేత్త ధర్మేంద్ర కంథాల్ ఆమెకు ఈ మహత్తర సవాల్ ఎదుర్కోవడంలో స్ఫూర్తినిచ్చాడని దివ్య శ్రీవాత్సవ చెబుతారు.
ధర్మేంద్ర కంథాల్ ఓ సామాజిక కార్యకర్త. పులుల సంతతి పరిరక్షణ, వేటగాళ్ల బారినుంచి పులులను కాపాడే ఓ సామాజిక సంస్థను నడుపుతున్నారు. ధర్మేంద్ర స్ఫూర్తితో దివ్య పూర్తిగా కొత్త రంగంలో అడుగుపెట్టి.. దానినే వృత్తిగా చేసుకుంది. ఫలితం.. అరుదైన హస్తకళా కేంద్రం ధోంక్ సాకారమైంది. ఒకప్పుడు పులులను వేటాడి జీవితం గడిపే పేద కుటుంబాలను సంస్కరించి, వారికి అండగా నిలిచింది. నిరక్షరాస్యులైన గిరిజనుల కుటుంబాలకు ఓ ఉపాధి కల్పిస్తోంది. రణథంబోర్ నేషనల్ పార్క్ చుట్టుప్రక్కల వున్న గిరిజన తెగల జీవితాల్లో అనూహ్యమైన మార్పు తెచ్చింది దివ్య శ్రీవాత్సవ. ధోంక్ (్ద్యశరీ) ఆరావళి పర్వత శ్రేణిలో కన్పించే ఓ అరుదైన చెట్టు.. ప్రకృతిని ప్రేమించే దివ్య తమ హస్తకళా కేంద్రానికి ఆ పేరే పెట్టుకుంది.
హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండక.. ఈ కొత్త తలనొప్పి పెట్టుకున్నావే.. అని దివ్య శ్రీవాత్సవను విమర్శించేవాళ్లకు కొదవలేదు. కానీ ధీరోదాత్తురాలు.. అందుకు వెరవలేదు. తాను గతంలో సంపాదించుకున్నదంతా ఖర్చుచేసి, పేద గిరిజన కుటుంబాల్లో స్ఫూర్తినింపి.. వారికి నాలుగు డబ్బులు సంపాదించుకునే వీలు కల్పించి.. హస్తకళల తయారీకి అవసరమైన ముడిసరుకులు, కుట్టుమిషన్లు కోసం ధారపోసింది. చేతి చమురు బాగోతం.. అనేవాళ్లు ఉన్నా బేఖాతర్ చేసింది. రంగు రంగుల చిన్న చిన్న పర్స్‌లు, రాజస్థాని సాంప్రదాయ చిక్కాలు.. అరుదైన బుట్టబొమ్మలు, ఒంటెలు, ఏనుగులు, పులుల బొమ్మలు... ముచ్చటైన చేతి రుమాళ్లు, తలగడ గలీబులు.. ఒకటేమిటి.. రకరకాల వస్తువులు గిరిజన మహిళల చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. 50కిపైగా కుటుంబాలు ధోంక్.. నీడన బతుకుతున్నాయి. ఈ ఉత్పత్తుల తయారీ ఓ సవాల్ అయితే, మార్కెటింగ్.. మరో తలకు మించిన పని. అయినా ఈ ఉత్పత్తులు, కొత్త కొత్త డిజైన్లు.. రణథంబోర్ ప్రాంతానికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కమిషన్ వ్యాపారులు ఈ ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు రావడంతో మార్కెటింగ్ నడిచిపోతోంది. దివ్య శ్రీవాత్సవ వినూత్న ప్రాజెక్టుకు.. పలువురు అండగా నిలిచారు. వారిలో టూర్ ఆపరేటర్లు మనోహర్ సింగ్‌జీ వంటివారెందరో. కష్టనష్టాలకు ఓర్చి.. పదిమందికి ఉపాధి కల్పించేందుకు.. సామాజిక సేవలో నడుం బిగించిన దివ్య శ్రీవాత్సవ ప్రస్థానం.. మరెందరికో స్ఫూర్తిదాయకం!