యువ

చిన్నారులకు తోడూ నీడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరులొలికించే చిన్నారుల నవ్వులే తల్లిదండ్రులకు మణిమాణిక్యాలు. ఉయ్యాలలో నిద్రపోతూ, మధ్య మధ్యలో నవ్వులు చిందించే పసికందుల్ని చూసి ఆనందపడని అమ్మా నాన్న ఉంటారా? అలాగే వారి చిలిపి చేష్టలు కూడా ఎంతో ఆనందం కలిగిస్తాయి. అలాగని అన్ని వేళలా చిన్నారులను చూస్తూ ఉండిపోలేం. ఒకవేళ పసికందుల్ని ఆయాకు అప్పగించి బయటకు వెళ్లాల్సి వస్తే, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారోనని మనసంతా చిన్నారుల చుట్టూనే తిరుగుతుంటుంది. అయితే ఇకపై అలాంటి భయాలూ, బెంగలూ అక్కర్లేదు. అనుక్షణం చిన్నారుల్ని కనిపెడుతూ, వారు చేసే అల్లరిని, వాళ్లు చిందించే నవ్వుల్ని రికార్డు చేసి మనకందించే గాడ్జెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దాని పేరు- ఇన్‌విడ్యో (జశ్పజజూక్య). చిన్నసైజు గొట్టంలా ఉండే ఈ గాడ్జెట్‌ని చిన్నారులకు దగ్గర్లో ఉంచితే చాలు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ గాడ్జెట్ పిల్లల చిరునవ్వుల్ని, వారి భావోద్వేగాలనూ పసిగట్టి రికార్డు చేస్తుంది. గాడ్జెట్‌కు అనుసంధానంగా పనిచేసే ఇన్‌విడ్యో యాప్ ద్వారా ఈ సమాచారమంతా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందుతూ ఉంటుందన్నమాట. మరో విశేషమేమంటే..పసికందుల చిరునవ్వుల్ని ఆల్బమ్‌గా రూపొందించుకునేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటుంది. బాగుంది కదూ ఈ గాడ్జెట్! దీని ధర 129 డాలర్లు.