యువ

ఆటోలో నెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం చేసినా వెరైటీగా చేయాలనుకునేవారు తక్కువ మందే ఉంటారు. ఏం చేసినా ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలనుకునేవారూ తక్కువ మందే ఉంటారు. ఆ కోవకు చెందినవాడే అన్నాదురై. ఈ పేరుగలవారు చెన్నైలో చాలామందే ఉంటారు. కానీ, ఆటో అన్నాదురై అని అడిగి చూడండి. తెలియనివారు ఉండరు. అంతగా పాపులర్ అయిన 31 ఏళ్ల అన్నాదురై ఓల్డ్ మహాబలిపురంలో ఆటో నడుపుతూంటాడు. అతని ఆటో ఎక్కి చూస్తే, ఆశ్చర్యపోవడం ప్రయాణికుల వంతవుతుంది మరి. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు సహా కంప్యూటర్, లాప్‌టాప్, టాబ్లెట్, ఐప్యాడ్ వంటి సదుపాయాలన్నీ అన్నాదురై ఆటోలో ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వాటికి వైఫై కనెక్షన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రయాణికులకు తగిన వసతులు కల్పించడం తన బాధ్యత అంటాడు అన్నాదురై. తన ఆటోను టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చి నాలుగేళ్లవుతోంది. అప్పటినుంచీ అతని ఆటో ఓ క్రేజీగా మారిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలూ అతని ఆటో ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తారు. అంతెందుకు? ఆటో అన్నాదురైకి ఫేస్‌బుక్‌లో ఫాలోయర్ల సంఖ్య పదివేలు దాటింది కూడా! ఇంటర్‌తో చదువు ఆపేసి, ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన అన్నాదురైలో మానవీయ కోణం కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తన ఆటోలో ప్రయాణికులను ఉచితంగానో లేక డిస్కౌంట్ మీదనో ఎక్కించుకుంటాడు. వాలంటైన్స్ డే రోజు ప్రేమికులకు అతని ఆటో ఉచితం. టీచర్స్ డేనాడు టీచర్లకు ఫ్రీ. అలాగే మదర్స్ డే రోజు ఆడవాళ్లకు ఉచితం. ఆటోలో ఏర్పాటు చేసిన గాడ్జెట్లు వాడుకున్నందుకు అన్నాదురై 10, 15, 20, 25 రూపాయల చొప్పున చార్జ్ చేస్తాడు. ఆటో ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ చార్జీలుంటాయి. డబ్బును క్యాష్ రూపంలోనే చెల్లించక్కర్లేదు. డెబిట్, క్రెడిట్ కార్డులపైనా చెల్లించొచ్చు. నెలకు 45 వేలు సంపాదించే అన్నాదురై, ఆ మొత్తంలోంచి తొమ్మిది వేల రూపాయలను తను కల్పించే సర్వీసులకోసం వెచ్చిస్తాడు. తాజాగా తన ఆటోకోసం అన్నాదురై ఓ యాప్ తయారు చేయిస్తున్నాడు. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే తన ఆటో ఎక్కడుందో ప్రయాణికులు ట్రాక్ చేయవచ్చట. టెక్నాలజీని ఇంతగా ప్రజోపయోగకరంగా వాడుతున్న అన్నాదురై సేవలను అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు గుర్తించాయి. తమ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఇలా ఓడాఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్, డాన్‌ఫోస్, గమేసా వంటి సంస్థలు అతనిని పిలిచి లెక్చర్లు ఇప్పించాయి. దటీజ్ ఆటో అన్నాదురై!